మ్యాజిక్‌ ‘ఫికర్‌’ | - | Sakshi
Sakshi News home page

మ్యాజిక్‌ ‘ఫికర్‌’

Feb 14 2026 10:09 AM | Updated on Feb 14 2026 10:09 AM

మ్యాజిక్‌ ‘ఫికర్‌’

మ్యాజిక్‌ ‘ఫికర్‌’

కారుకు రెండు.. చేతికి నాలుగు అవసరం

ఇస్నాపూర్‌ కౌంటింగ్‌కేంద్రం వద్ద ఉద్రిక్తత

పటాన్‌చెరు టౌన్‌: ఇస్నాపూర్‌ బల్దియాలో చైర్మన్‌ పదవిని దక్కించుకునేందుకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల మధ్య పోటీ నెలకొనడంతో కౌంటింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇస్నాపూర్‌ మున్సిపాలిటీలో 26 వార్డులకు గాను బీఆర్‌ఎస్‌ 12, కాంగ్రెస్‌ 10 వార్డుల్లో విజయం సాధించాయి. మిగిలిన నాలుగు వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. చైర్మన్‌ పదవికి మ్యాజిక్‌ ఫిగర్‌ సాధించాలంటే బీఆర్‌ఎస్‌కు ఇద్దరు సభ్యులు...కాంగ్రెస్‌కు అయితే నలుగురు సభ్యుల మద్దతు అవసరమైంది. దీంతో స్వతంత్రులను తమ వైపు తిప్పుకునేందుకు ఇరు పార్టీలు ప్రయత్నించాయి. దీంతో ఇరుపార్టీల నేతలు అభ్యర్థులను తీసుకెళ్తున్నారంటూ కౌంటింగ్‌ కేంద్రం వద్ద ఆరోపణలు చేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి ఇరు పార్టీల నాయకులను నచ్చజెప్పి ఇళ్లకు పంపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement