డంప్‌యార్డును తరలించాలి
పట్టణంలో కాలనీల మధ్య చెత్త నిల్వ కేంద్రాన్ని నిర్వహించవద్దు. దాన్ని తొలగించేంత వరకు పోరాటం కొనసాగుతుంది. అధికారులు , పాలకుల నిర్లక్ష్యం కారణంగా అమీన్‌పూర్ డంపింగ్ యార్డులో మంటలు వ్యాప్తి చెందాయి. వాటిని వెంటనే అదుపులోకి తేవాలి.
– ఆకుల తిరుపాల్ రెడ్డి, ప్రెసిడెంట్,
పీపుల్స్ అసోసియేషన్, అమీన్‌పూర్
నరక యాతన
ఇది అత్యంత దారుణం. చెత్త తగలబెట్టడం చట్ట రీత్యా నేరం. కొన్ని రోజులుగా డంపుయార్డులో చెత్త తగుల బడుతున్నప్పటికీ అధికారులు, పాలకులు స్పందించడం లేదు. స్వచ్ఛమైన గాలి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 300 పైగా చూపుతుంది.
– రమేశ్, మోడీ కాలనీ, అమీన్‌పూర్


