సామాన్య భక్తులే వీఐపీలు | - | Sakshi
Sakshi News home page

సామాన్య భక్తులే వీఐపీలు

Feb 6 2026 11:45 AM | Updated on Feb 6 2026 11:45 AM

సామాన్య భక్తులే వీఐపీలు

సామాన్య భక్తులే వీఐపీలు

శివరాత్రి ‘జాతర’పై సమీక్షలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి

శివరాత్రి ‘జాతర’పై సమీక్షలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి

పటాన్‌చెరు: శివరాత్రి ఉత్సవాల్లో సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని వీఐపీలుగా వారికి గుర్తింపునివ్వాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సూచించారు. బీరంగూడ డివిజన్‌ పరిధిలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఐదు రోజులపాటు నిర్వహించనున్న జాతర సందర్భంగా గురువారం ఉదయం ఆలయ ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షకు ఎమ్మెల్యే జీఎంఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఫిబ్రవరి 14 నుంచి 18 వరకు శివరాత్రి జాతర వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాలని ఆదేశించారు. శివరాత్రి సందర్భంగా స్థానిక భక్తులతోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 4 లక్షల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉందని తెలిపారు. ఐదు రోజులపాటు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ ఇంటిగ్రేటెడ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయాలని ఈవో శశిధర్మం ఆదేశించారు. సమావేశంలో జిల్లా పరిషత్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌, అమీన్‌పూర్‌ మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ పాండురంగారెడ్డి, మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి, తహసీల్దార్‌ వెంకటేశ్‌, ఆలయ ఈవో శశిధర్‌, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement