మైనర్ల డ్రైవింగ్‌పై నజర్
● డ్రంకెన్ డ్రైవ్, మైనర్‌డ్రైవింగ్‌పై ప్రత్యేక తనిఖీలు
● డిసెంబర్ నుంచి 817 మంది పట్టివేత
సిద్దిపేటకమాన్: రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజు పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. మైనర్లు, డ్రంకెన్ డ్రైవ్‌పై నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై జరిమానాలతో పాటు కేసులు నమోదు చేస్తున్నారు. వారిని కోర్టులో హాజరుపర్చగా జరిమానాలు విధిస్తున్నారు. మైనర్ డ్రైవింగ్ చేస్తున్న 86 మందిని, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న 817 మందితో పాటు మొత్తం 903 పెట్టి కేసులు నమోదు చేశారు. వారిని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రూ.5వేల చొప్పున మొత్తం రూ.45.15లక్షల జరిమాన విధించారు. నంబర్ ప్లేట్ వాయిలేషన్ 1,153, డ్రంకెన్ డ్రైవ్ కేసులు 1,185, త్రిబుల్ డ్రైవింగ్ 453కేసులు నమోదు చేశారు.
మొక్కలు నాటేలా శిక్ష
వారం రోజుల క్రితం మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన 39 మందిని పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. స్థానిక కోమటి చెరువు పరిసరాల్లో మొక్కలు నాటాలని న్యాయమూర్తి తీర్పునివ్వడంతో ట్రాఫిక్ పోలీసులు వారి చేత ఆ పని చేయించారు. వారి తల్లిదండ్రులకు ఐదు వేల చొప్పున జరిమాన విధించారు.
మైనర్ డ్రైవింగ్ చేయకూడదు
మైనర్లు డ్రైవింగ్ చేయకూడదు. వారికి వాహనాలు ఇస్తే బాధ్యులైన వారి తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటాం. మద్యం తాగి వాహనాలు నడిపినా, మైనర్, త్రిబుల్ డ్రైవింగ్, లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపినా చర్యలు తప్పవు.
– సుమన్‌కుమార్,
సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ
మైనర్ల డ్రైవింగ్‌పై నజర్


