రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
మనోహరాబాద్(తూప్రాన్): రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... మేడ్చల్ జిల్లా ఎల్లపేట మున్సిపాలిటీ పరిధిలోని కోనాయపల్లికి చెందిన గుంటి నవీన్(35) తన బంధువులు చనిపోవడంతో శుక్రవారం అంత్యక్రియలకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో మండలంలోని కాళ్లకల్ శివారులో మైకో పరిశ్రమ దగ్గర గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా మృతునికి భార్య ధనలక్ష్మి, పిల్లలు రిషికుమార్, ప్రణవి ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేశారు.


