జహీరాబాద్‌లో కింగ్‌మేకర్‌ కావాలి | - | Sakshi
Sakshi News home page

జహీరాబాద్‌లో కింగ్‌మేకర్‌ కావాలి

Feb 9 2026 8:54 AM | Updated on Feb 9 2026 8:54 AM

జహీరాబాద్‌లో కింగ్‌మేకర్‌ కావాలి

జహీరాబాద్‌లో కింగ్‌మేకర్‌ కావాలి

జహీరాబాద్‌ టౌన్‌: జహీరాబాద్‌ మున్సిపాలిటీలో ఎంఐఎం కింగ్‌ మేకర్‌ కావాలని, మెజార్టీ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ పిలుపునిచ్చారు. జహీరాబాద్‌ పట్టణంలోని ఈద్గా వద్ద ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారం సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రధాన రాజకీయ పార్టీలు ముస్లింలను ఓటు బ్యాంక్‌గా వాడుకుంటున్నాయని కష్టకాలంలో ముస్లింలకు ఎంఐఎం మాత్రమే అండగా ఉంటుందని వివరించారు. ముస్లింలు రాజకీయ నాయకత్వాన్ని పెంచుకోవాలని పిలుపునిచ్చారు. ఎంఐఎం తరఫున మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మెజార్టీ కౌన్సిలర్లను గెలిపిస్తే కింగ్‌ మేకర్‌ అవుతామని, తాము అనుకున్న వ్యక్తి చైర్మన్‌ అవుతారని పేర్కొన్నారు. జహీరాబాద్‌లోని ఐడీఎస్‌ఎంటీ కాలనీ సమస్యను కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పట్టించుకోలేదని తమ పార్టీ లబ్ధిదారులకు అండగా ఉంటామని హామీనిచ్చారు. ముస్లిం షాదీఖానా నిర్మాణ పనులతోపాటు అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీనిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఇన్‌చార్జి కై సర్‌, జహీరాబాద్‌ అధ్యక్షుడు అక్తర్‌ అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

మజ్లీస్‌ అధినేత,ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement