ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
చేగుంట(తూప్రాన్): ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మాసాయిపేట మండలం పోతాన్‌పల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబీకుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన ఎర్ర శంకర్(42) కూలీ పనులు చేసుకుంటూ జీస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం గుండె ఆపరేషన్ కోసం రూ.5లక్షలు అప్పులు చేశాడు. అప్పులు తీర్చేందుకు మార్గం కనిపించక పోవడంతో నిత్యం బాధపడుతుండేవాడు. ఈ క్రమంలో శంకర్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అప్పులు తీర్చే మార్గం లేక..
హవేళిఘణాపూర్(మెదక్): వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండల పరిధిలోని వాడి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా... గ్రామానికి చెందిన బక్కంగారి బీమయ్య(38) ఇంటి నిర్మాణం, కుటుంబం కోసం చేసిన అప్పులు చేశాడు. దీంతో వాటిని ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనస్తాపానికి గురై సోమవారం రాత్రి ఇంట్లో నుంచి వెళ్లాడు. మంగళవారం ఉదయం చూసేసరికి గ్రామ శివారులోని చెట్టుకు ఉరి వేసుకున్నాడు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.
మద్యానికి బానిసై..
కొల్చారం(నర్సాపూర్): మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని పోతంశెట్టిపల్లి చౌరస్తాలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు, ఎస్‌ఐ మహమ్మద్ మైనొద్దీన్ కథనం ప్రకారం... గ్రామానికి చెందిన ఎల్లపురం వెంకటేశం (31) కుటుంబ పోషణ భారం కావడంతో భార్య , ఇద్దరు కూతుర్లతో కలిసి రెండేళ్ల క్రితం బతుకుదెరువు కోసం షాపూర్‌నగర్‌కు వెళ్లి పనులు చేసుకుంటు జీవిస్తున్నారు. మద్యానికి బానిసైన వెంకటేశం పనిచేయకపోవడంతో కుటుంబ పోషణ భారమై ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. ఈ విషయమై భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. జనవరి 25న స్వగ్రామమైన పోతంశెట్టిపల్లికి వచ్చాడు. ఈ క్రమంలో మధ్యాహ్నం ఇంటి తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చిన తోటి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి తలుపు తెరిచి చూడగా దూలానికి చీరతో ఉరివేసుకొని కనిపించాడు.


