దుబ్బాక ప్రగతే.. మా అజెండా | - | Sakshi
Sakshi News home page

దుబ్బాక ప్రగతే.. మా అజెండా

Feb 8 2026 7:57 AM | Updated on Feb 8 2026 7:57 AM

దుబ్బ

దుబ్బాక ప్రగతే.. మా అజెండా

రెవెన్యూ డివిజనేది?

రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ పట్టణంలో రోడ్ల విస్తరణ చేపట్టాలి మెరుగైన విద్య, వైద్య సౌకర్యాల కల్పన సమస్యలపై అవగాహన ఉన్న వారినే ఎన్నుకుంటాం ‘సాక్షి’ డిబేట్‌లో దుబ్బాక వాసుల అభిప్రాయాలు

దుబ్బాకలో సమస్యలు తిష్ట వేశాయి..

ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది. విద్య, వైద్యం, రోడ్లు, చెరువులు, స్టేడియాలు మొదలుకొని ఇంకా అభివృద్ధిలో వెనుకబడిందని శనివారం నిర్వహించిన సాక్షి డిబేట్‌లో పట్టణ ప్రముఖులు, విద్యావేత్తలు, వివిధ సంఘాల నేతలు, విద్యార్థులు పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఈసారి అభివృద్ధి, సమస్యలు, సమాజంపై అవగాహన ఉన్న నాయకులనే ఎన్నుకుంటామని, ఇదే మా అజెండా అని గళమెత్తడంపై

ఈ వారం కథనం. – దుబ్బాక

విప్లవోద్యమాల పుట్టినిల్లు..పోరాటాల పురిటిగడ్డ..రాజకీయ చైతన్యానికి రాష్ట్రంలోనే ప్రసిద్ధి దుబ్బాక. ఎందరో మేథావులను.. అతిరథ మహారథులను దేశానికి అందించిన దుబ్బాక ఇంకా చాలా రంగాల్లో వెనుకబడి ఉండటంపై ప్రజల్లో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. ఈ గడ్డపైనే పుట్టి పెరిగి.. విద్యాబుద్ధులు నేర్చిన పలువురు ప్రముఖులు దేశ, రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది కీలక స్థానాల్లో ఉన్నారు. కానీ ఏళ్ల నుంచి దుబ్బాక పట్టణంలో రోడ్ల విస్తరణ కాకపోవడంతో ఇరుకురోడ్లతో ప్రజలు నరకయాతన పడుతున్నారు. దశాబ్దంన్నర కాలంగా రెవెన్యూ డివిజన్‌ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నా ఇంత వరకు ఏ రాజకీయపార్టీ అధికారంలోకి వచ్చినా నెరవేర్చలేదంటూ అభిప్రాయపడ్డారు. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో శనివారం దుబ్బాక పట్టణంలోని శివాజీ చౌరస్తాలో సాక్షి ఆధ్వర్యంలో ప్రజల అజెండాపై డిబేట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా డిబేట్‌లో పట్టణంలోని ప్రముఖులు, విద్యావేత్తలు, వివిధ సంఘాల నేతలు, వాకర్లు, విద్యార్థులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఎన్నికల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ సమాజంపై అవగాహన ఉన్న వారినే కౌన్సిలర్లుగా గెలిపించుకోవాలన్నారు. గెలిచిన కౌన్సిలర్లు పట్టణ అభివృద్ధితో పాటు రెవెన్యూ డివిజన్‌, విద్య, వైద్యం, రోడ్లు అభివృద్ధితో పాటు ప్రజల మౌళిక సౌకర్యాల కల్పనకు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. డిబేట్‌లో పాల్గొన్న పలువురి అభిప్రాయాలు ఇలా...

దుబ్బాకను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలి. 15 ఏళ్లుగా డివిజన్‌ ఏర్పాటు చేస్తామంటూ హామీలివ్వడమే తప్పా ఇంత వరకు నెరవేర్చలేదు. ఎన్నికలప్పుడు హామీ ఇవ్వడం తర్వాత మర్చిపోవడం రాజకీయ పార్టీలకు అలవాటుగా మారిపోయింది. ఈ ఎన్నికల్లో కచ్చితంగా డివిజన్‌పై స్పష్టమైన హామీ ఇవ్వాలని దుబ్బాక ప్రజల తరపున డిమాండ్‌ చేస్తున్నాం. డివిజన్‌ కోసం ఏళ్లుగా ఉద్యమాలు చేస్తున్నా ప్రజల చిరకాల వాంఛను తీర్చకపోవడం చాలా బాధాకరం.

–మాడబోయిన శ్రీకాంత్‌,

దుబ్బాక డెవలప్‌మెంట్‌ ఫోరం అధ్యక్షుడు

దుబ్బాక ప్రగతే.. మా అజెండా 1
1/3

దుబ్బాక ప్రగతే.. మా అజెండా

దుబ్బాక ప్రగతే.. మా అజెండా 2
2/3

దుబ్బాక ప్రగతే.. మా అజెండా

దుబ్బాక ప్రగతే.. మా అజెండా 3
3/3

దుబ్బాక ప్రగతే.. మా అజెండా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement