సైన్స్‌తోనే మానవాళి ప్రగతి | - | Sakshi
Sakshi News home page

సైన్స్‌తోనే మానవాళి ప్రగతి

Feb 6 2026 7:14 AM | Updated on Feb 6 2026 7:14 AM

సైన్స్‌తోనే మానవాళి ప్రగతి

సైన్స్‌తోనే మానవాళి ప్రగతి

ప్రజా శాస్త్రవేత్త రమేశ్‌

సదాశివపేట(సంగారెడ్డి): సైన్స్‌తోనే మానవాళి ప్రగతి సాధ్యమని ప్రజా శాస్త్రవేత్త రమేశ్‌ స్పష్టం చేశారు. పట్టణంలోని ఓ పాఠశాలలో ప్లాస్టిక్‌ నిషేధం, రసాయనిక ఎరువుల వినియోగం తగ్గింపు, ప్రకృతి సేద్యం, భారత రాజ్యాంగ విలువల పరిరక్షణ అంశాలపై బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. ప్రకృతి మన జీవనానికి ఆధారమని ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుందని రమేశ్‌ విద్యార్థులకు సూచించారు. ప్లాస్టిక్‌ వస్తువుల వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని చెప్పారు. కార్యక్రమంలో విజ్ఞానదర్శిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్‌ అలీ, కమిటీ సభ్యులు శోభారాణి, మంగక్క, టీపీటీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్‌, తెలంగాణ శ్యామ్‌, అమ్మ అవయవదాన సంస్థ వ్యవస్థాపకుడు ఈశ్వరలింగం, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి అనిల్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement