విశ్వశాంతి కోసం దమ్మ పాదయాత్ర
జహీరాబాద్ టౌన్: విశ్వశాంతి కోసం దమ్మ పాదయాత్ర ప్రారంభించినట్లు గగన్ మాలిక్ ఫౌండేషన్ అధ్యక్షుడు గగన్ మాలిక్ అన్నారు. శాంతి కోసం కర్నాటక రాష్ట్రంలోని గుల్బర్గా నుంచి ప్రారంభమైన దమ్మ పాదయాత్ర మండలంలోని బూచినెల్లి గ్రామానికి చేరుకోగా మంగళవారం రాత్రి అక్కడే బసచేశారు. బుధవారం ఉదయం గ్రామం నుంచి ప్రారంభమైన పాదయాత్ర హుగ్గెల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా గగన్ మాలిక్ మాట్లాడుతూ విశ్వశాంతితో పాటు ప్రజలంతా సోదర భావంతో ఉండాలన్నదే దమ్మ పాదయాత్ర లక్ష్యమన్నారు. దమ్మ పాదయాత్ర మార్చి 3 తేదీన నాగార్జున సాగర్‌కు చేరుకుంటుందన్నారు. పాదయాత్రలో సంఘం ప్రాజెక్ట్ డైరెక్టర్ సాంగఫాక్ కోవిడో, థాయిలాండ్ బౌద్ధ భిక్షువులు, రాజామూర్తి, సిద్ధోజీ శ్యాంసుందర్, కిశోర్ పాల్గొన్నారు.


