ఎల్‌ఐసీలో విదేశీపెట్టుబడులు ప్రమాదకరం | - | Sakshi
Sakshi News home page

ఎల్‌ఐసీలో విదేశీపెట్టుబడులు ప్రమాదకరం

Feb 8 2026 7:54 AM | Updated on Feb 8 2026 7:54 AM

ఎల్‌ఐసీలో విదేశీపెట్టుబడులు ప్రమాదకరం

ఎల్‌ఐసీలో విదేశీపెట్టుబడులు ప్రమాదకరం

రాష్ట్ర ఏఐటీయూసీ అధ్యక్షుడు ఎండీ.యూసుఫ్‌

రామచంద్రాపురం(పటాన్‌చెరు): ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని, ఎల్‌ఐసీలో వందశాతం విదేశీ పెట్టుబడులను అనుమతించడం ప్రమాదకరమైన నిర్ణయమని రాష్ట్ర ఏఐటీయూసీ అధ్యక్షుడు ఎండీ.యూసుఫ్‌ పేర్కొన్నారు. ఈనెల 12న జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బెల్‌ కాలనీలోని ఏఐటీయూసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అధికార కార్మిక సంఘం అధ్యక్షులు కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.

సీఐటీయూ ఆధ్వర్యంలో...

బెల్‌ కాలనీలో సీఐటీయూ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్‌ కార్మికుల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర సీఐటీయూ కమిటీ సభ్యలు రాజయ్య పాల్గొని దేశవ్యాప్తంగా జరగనున్న సమ్మెలో కాంట్రాక్ట్‌ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement