జనరలైనా తగ్గేదేలే!
జనరల్
స్థానాల్లో పది మంది మహిళల పోటీ
సదాశివపేట(సంగారెడ్డి): మహిళా రిజర్వేషన్‌కే ఆ వనితలు పరిమితం కాలేదు. అన్ రిజర్వుడ్ జనరల్ అంటే పురుషులకు మాత్రమే కేటాయించినట్లు కాదంటూ తాము కూడా ఎన్నికల బరిలోకి దిగి పోటీకి సై అంటున్నారు. సదాశివపేట మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు ఎస్టీ జనరల్ అయినా ఆ సామాజిక వర్గానికి చెందిన ప్రమీల(బీఆర్‌ఎస్),ఎరుకల అనూష(స్వతంత్ర), 3వ వార్డు ఎస్సీ జనరల్‌కు కేటాయించినా అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి రేణుక పోటీ చేస్తున్నారు. ఇక 7వ వార్డు అన్‌రిజర్వుడుకు కేటాయించినా అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పాతదొడ్డి అనిత పోటీ పడుతున్నారు. 8వ వార్డు బీసీ జనరల్‌కే అయినా అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి సీహెచ్ రేణుక, 9వ వార్డు ఎస్సీ జనరల్‌కే రిజర్వు అయినా నీలిమా (బీఆర్‌ఎస్), దాసాయిలక్ష్మి (బీజేపీ)జ్యోతిసుజాత (స్వతంత్ర), 16వ వార్డు బీసీ జనరల్ రిజర్వు అయినా అక్కడ కొత్తగొల్ల లావణ్య (కాంగ్రెస్), దోడ్ల విజయలక్ష్మి(స్వతంత్ర) అభ్యర్థులుగా పురుషులతో పోటీ పడుతుండటం విశేషం.


