భవిష్యత్‌తరాలకు వనరులు రక్షించాలి | - | Sakshi
Sakshi News home page

భవిష్యత్‌తరాలకు వనరులు రక్షించాలి

Feb 13 2026 5:37 AM | Updated on Feb 13 2026 5:37 AM

భవిష్యత్‌తరాలకు వనరులు రక్షించాలి

భవిష్యత్‌తరాలకు వనరులు రక్షించాలి

● డీఆర్‌డీఎల్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ కృష్ణమోహన్‌ ● ఏరిస్‌–2026 జాతీయ సదస్సు ప్రారంభం

● డీఆర్‌డీఎల్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ కృష్ణమోహన్‌ ● ఏరిస్‌–2026 జాతీయ సదస్సు ప్రారంభం

నర్సాపూర్‌: భవిష్యత్‌తరాల కోసం సహజ వనరులను సంరక్షించాల్సిన అవసరం ఉందని హైదరాబాద్‌ డీఆర్‌డీఎల్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ ఆర్‌. కృష్ణమోహన్‌ చెప్పారు. గురువారం స్థానిక బీవీ రాజు ఇంజనీరీంగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన ఏరిస్‌–2026 జాతీయ సదస్సు ప్రారంభో త్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వాతావరణంలో జరుగుతున్న అసాధారణ మార్పుల కారణాలను శాసీ్త్రయంగా అధ్యయ నం చేయాల్సిన అవసరాన్ని ఆయన వివరించా రు. దేశీయ, గ్లోబల్‌ ప్రయోజనాల రక్షణకు బలమైన వ్యవస్థలను అభివృద్ధి చేయాలని కృష్ణ మోహన్‌ పిలుపునిచ్చారు. శ్రీవిష్ణు ఎడ్యుకేషనల్‌ సోసైటీ వైస్‌ చైర్మన్‌ రాజగోపాల్‌ మాట్లాడుతూ ఏరిస్‌–2026ను స్లార్‌ కన్సార్టియంగా అభివర్ణంచి సంయుక్త పరిశోధనలకు ఒక విలువైన వేదిక కాగలదని చెప్పారు. ఎలాన్‌మస్క్‌ స్టార్‌ లింక్‌ లాంటి గ్లోబల్‌ ఆవిష్కరణలను ఆయన ఉదహరిస్తూ స్పష్టమైన సమస్యలను నిర్వహించడం, లోతైన పఠన అలవాట్లు, మేథో జి/్ఞాసను పెంపొందించుకోవడం అవసరాన్ని ఆయన వివరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ సంజ య్‌దూబె మాట్లాడుతూ సదస్సు రెండు రోజుల పాటు జరుగుతుందని చెప్పారు. సదస్సులో డీఆర్‌డీఎల్‌, ఎన్‌ఏఆర్‌ఎల్‌, ఎన్‌ఆర్‌ఎస్‌సీ, ఎస్‌పీఎల్‌, ఐఎండీ, ఐఐసీటీ, ఐఎన్‌సీఓఐఎస్‌ తదితర సంస్థలకు చెందిన ప్రతినిధులతో పాటు భూశాస్త్రాల మంత్రిత్వ శాఖకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ప్రొఫెసర్లు, ఆయా రంగాల నిపుణులు పాల్గొంటారని ఆయన చెప్పారు. డైరెక్టర్‌ లక్ష్మిప్రసాద్‌, ఇతర ప్రతినిధు లు మృణాళిని, మేనేజర్‌ బాపిరాజు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ సలావుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement