శనివారం శ్రీ 7 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

శనివారం శ్రీ 7 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

Feb 7 2026 3:02 PM | Updated on Feb 7 2026 3:02 PM

శనివా

శనివారం శ్రీ 7 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

శనివారం శ్రీ 7 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

న్యూస్‌రీల్‌

తార్‌మార్‌ టక్కర్‌మార్‌

జహీరాబాద్‌: ఎన్నికల్లో అధికంగా బహుముఖ పోటీలే నెలకొనడంతో ఓట్లు చీలడం ద్వారా గెలుపు ఓటములపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందనే ఆందోళన అభ్యర్థుల్ని కలవరపెడుతోంది. ఓట్లు చీలడం ద్వారా గెలిచే అవకాశాలున్నవారు సైతం ఓటమిని చవిచూసే పరిస్థితులు ఎదురవుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జహీరాబాద్‌ మున్సిపాలిటీలో ఉన్న 37 వార్డుల్లోనూ ఏ ఒక్క వార్డులో కూడా ముఖాముఖీ పోటీ లేదు. 7 వార్డుల్లో త్రిముఖ పోరు, 10 వార్డు ల్లో చతుర్ముఖ పోరు సాగుతుండగా, 20 వార్డుల్లో మాత్రం ఐదు నుంచి 8 మంది వరకు అభ్యర్థులు బరిలో ఉండటంతో బహుముఖ పోటీలు నెలకొన్నాయి. చతుర్ముఖ, బహుముఖ పోటీలు నెలకొన్న వార్డుల్లో భారీగా ఓట్లు చీలిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇది పోటీలో ఉన్న అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తోంది.

మొదటికే మోసం వస్తుందని..

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీల్లో టికెట్లు దక్కని వారు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఏకంగా 49 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. బీజేపీ తరఫున 27 మంది పోటీ చేస్తుండగా, ఎంఐఎం తరఫున 14 మంది పోటీలో ఉన్నారు. బీజేపీ, ఎంఐఎం పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు చీల్చే ఓట్ల వల్ల గెలుపు ఓటములు తారుమారయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు కలవరపడుతున్నారు. వారి ప్రభావాన్ని ఎలా తగ్గించాలి అనే అంశంపైనే పలువురు అభ్యర్థులు ప్రత్యేక దృష్టి పెట్టారు. నేరుగా ఓటర్లను కలిసి ఈ విషయమై వివరించి చెబుతున్నారు. లేకపోతే మొద టికే మోసం వస్తుందని అలాంటి పరిస్థితి ఎదురు కాకుండా చూడాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.

ఎవరి గెలుపును

ఎవరు మార్చేస్తారో!

అభ్యర్థులను వెంటాడుతున్న భయం

చీలిక ఓట్లతో గెలుపోటములపై ప్రభావం

ప్రత్యర్థుల బలహీనతలు

తెలుసుకునేలా వ్యూహాలు

ష్‌.. గప్‌చుప్‌

ప్రత్యర్థులు ఎప్పుడు ఎవరెవరితో కలుస్తున్నారు? ఎలాంటి హామీలు ఇస్తున్నారు? ఓటర్లు ఎవరి పట్ల ఆసక్తి చూపుతున్నారు? అనే దానిపై పోటీలో నిలిచిన అభ్యర్థులు నిఘా పెడుతున్నారు. అభ్యర్థులు తమ బలాబలాల కంటే ప్రత్యర్థుల బలహీనతలపైనే ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇందుకోసం అవతలి శిబిరంలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు సమాచారాన్ని తమకు చేరవేసేలా కొంతమందిని ప్రత్యర్థి శిబిరాల్లోకి పంపించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇలా ఎదుటి వారి బలహీనతలను తమకు అనుకూలంగా మలుచుకుని గెలిచేందుకు వ్యూహాలు రూపొందిస్తున్నారు. జహీరాబాద్‌ మున్సిపాలిటీలో 37 వార్డులకుగాను 174 మంది కౌన్సిలర్‌ అభ్యర్థులు బరిలో ఉండటంతో ప్రధానంగా ప్రత్యర్థుల బలహీనతలపై ఆసక్తి చూపుతున్నారు. ఎవరి ఓట్లు ఎటు పోయే అవకాశం ఉందనే విషయం తెలిస్తే వారిని అనుకూలంగా మలుచుకునే మార్గాలపై అభ్యర్థులు మార్గాలు అన్వేషిస్తున్నారు. దీంతో తమలో ఉన్న వారి నుంచి ప్రత్యర్థులకు ఎలాంటి సమాచారం చేరుతుందోననే ఆందోళన పలువురు అభ్యర్థులను వెంటాడుతోంది. దీంతో అభ్యర్థులు ఎవరితో ఏం మాట్లాడాలో తెలియక అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అభ్యర్థులు ఒంటరిగా ఉన్నప్పుడే ఫోన్‌ కాల్‌ మాట్లాడుతున్నారు. తమకు వచ్చే ఓట్లు ప్రత్యర్థులకు వెళ్లకుండా ఉండేందుకుగాను జాగ్రత్త పడుతున్నారు.

శనివారం శ్రీ 7 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20261
1/1

శనివారం శ్రీ 7 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement