కాంగ్రెస్‌ చేసిందేమీ లేదు | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ చేసిందేమీ లేదు

Feb 9 2026 8:53 AM | Updated on Feb 9 2026 8:53 AM

కాంగ్

కాంగ్రెస్‌ చేసిందేమీ లేదు

ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు

జిన్నారం(పటాన్‌చెరు): కాంగ్రెస్‌ ప్రభుత్వం గడిచిన రెండేళ్లలో ప్రజలకు చేసిందేమి లేదని

మున్సిపల్‌ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమని రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు పేర్కొన్నారు. గడ్డపోతారం పట్టణంలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. రేవంత్‌ ప్రభుత్వం 420 హామీలతో ప్రజలను మోసం చేసిందన్నారు. గడ్డపోతారం మున్సిపాలిటీలో 18 వార్డులను బీఆర్‌ఎస్‌ కై వశం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గ ఇన్‌చార్జి ఆదర్శ్‌రెడ్డి, మాజీ జెడ్పిటీసీ బాల్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ ప్రకాష్‌ చారి, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

పురపోరులో కాంగ్రెస్‌

సత్తా చాటాలి: గజ్జెల కాంతం

నారాయణఖేడ్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ సత్తాచాటి మెజార్టీ మున్సిపాలిటీలను కై వశం చేసుకుంటుందని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం తెలిపారు. ఖేడ్‌ మున్సిపల్‌ ఎన్నికల పరిశీలనకు వచ్చిన సందర్భంగా ఎమ్మెల్యే సంజీవరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధిపట్ల ప్రజలు అనుకూల ఫలితాలను ఇవ్వనున్నారని అన్నారు. చైర్మన్ల ఎన్నికను కౌన్సిలర్లను గెలుపొందిన తర్వాతే పార్టీ నిర్ణయిస్తుందని అన్నారు.

సంఘంపై అసత్య

ప్రచారం తగదు

టీఎన్‌జీఓ సంఘం అధ్యక్షుడు జావీద్‌ అలీ

సంగారెడ్డి : ఉద్యోగుల హక్కుల సాధనకు నిరంతరం కృషి చేసే టీఎన్‌జీఓ సంఘంపై అసత్య ఆరోపణలు సరికాదని ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు జావీద్‌ అలీ, రవి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 610 జీవోను సాధించి అంతిమంగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ముందుండి తెలంగాణను సాధించిన సంఘంగా చరిత్రలో గుర్తింపు ఉదన్నారు. కొంతమంది ఉద్యోగ సంఘం ముసుగులో టీఎన్జీవోపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారికి తగిన గుణపాఠం ఉద్యోగులే చెబుతారని హెచ్చరించారు.

కాంగ్రెస్‌తోనే

అభివృద్ధి సాధ్యం

టెమ్రిస్‌ చైర్మన్‌ ఫహీం ఖురేషీ

జహీరాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించడం ద్వారానే అభివృద్ధి త్వరితగతిన సాధ్యమవుతుందని టెమ్రిస్‌ చైర్మన్‌ ఫహీం ఖురేషీ పేర్కొన్నారు. రంజోల్‌లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల తరఫున ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించినట్లయితే ఆశించిన మేరకు అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. ప్రత్యేక నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పనులు చేపట్టేందుకుగాను తన వంతు కృషి చేస్తానని చెప్పారు.

అభివృద్ధి సంక్షేమాలే

బీజేపీ లక్ష్యం

ఎంపీ రఘనందన్‌రావు ప్రచారం

జిన్నారం (పటాన్‌చెరు): అభివృద్ధి సంక్షేమమే బీజేపీ లక్ష్యమని ఎంపీ రఘునందన్‌రావు పేర్కొన్నారు. గుమ్మడిదల మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అభ్యర్థుల ఆదివారం ఆయన విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. బీజేపీతోనే మున్సిపాలిటీలో అన్ని విధాల అభివృద్ధి జరుగుతుందన్నారు. పార్టీ బలపరిచిన కౌన్సిలర్‌ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి పార్టీని ఆదరించాలన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ సర్కార్‌ మోసపూరిత హామీలతో జనాలను మోసం చేసిందని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అభ్యర్థులు ప్రజలు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ చేసిందేమీ లేదు1
1/3

కాంగ్రెస్‌ చేసిందేమీ లేదు

కాంగ్రెస్‌ చేసిందేమీ లేదు2
2/3

కాంగ్రెస్‌ చేసిందేమీ లేదు

కాంగ్రెస్‌ చేసిందేమీ లేదు3
3/3

కాంగ్రెస్‌ చేసిందేమీ లేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement