బీజేపీతోనే దేశ భవిష్యత్తు
మాజీ ఎంపీ నవనీత్‌కౌర్
జహీరాబాద్: బీజేపీతోనే దేశ భవిష్యత్తు ముడిపడి ఉందని, దీన్ని గుర్తించి ప్రజలు కమలం గుర్తుకు ఓటేసి మద్దతుగా నిలవాలని మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ నాయకురాలు నవనీత్‌కౌర్ పిలుపునిచ్చారు. సోమవారం జహీరాబాద్‌లో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొని మాట్లాడారు. దేశ సంక్షేమం, అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు. ప్రజలు బీజేపీ అభ్యర్థులను గెలిపించినట్లయితే.. కేంద్రం నుంచి అత్యధిక నిధులు తీసుకొచ్చి జహీరాబాద్ మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలుపులేక పోయారన్నారు. 20 హామీలు ఇచ్చారని, హామీల సంఖ్యనే మోసం అని చెబుతోందన్నారు. ఇలాంటి పార్టీలకు ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. సమావేశంలో మాజీ ఎంపీ బీబీ పాటిల్, బీజేపీ ఎన్నికల ఇంచార్జి పైడి ఎల్లారెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఎం.జైపాల్‌రెడ్డి, నాయకులు సుభాష్‌రెడ్డి, భాస్కర్, జగన్, జనార్దన్‌రెడ్డి, సంతోష్, అరుణ, మంజుల, అర్చన సారడా, కౌన్సిలర్ అభ్యర్థులు పాల్గొన్నారు.


