‘సాక్షి’ చొరవ చాలా గొప్పది
ఎంఈఓ శ్రీనివాస్‌రెడ్డి
కొండపాక(గజ్వేల్): పదో తరగతి విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించేందుకు సాక్షి దినపతిక్ర చేసిన చొరవ చాలా గొప్పదని ఎంఈఓ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కొండపాక, మర్పడ్గ, సిర్సనగండ్ల గ్రామాల హైస్కూళ్లలో పదో తరగతి విద్యార్థులకు సాక్షి స్టడీ మెటీరియల్‌ను గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక నిపుణులతో సాక్షి స్టడీ మెటీరియల్‌ను తయారు చేయించడం గొప్ప విషయమన్నారు. మూడు గ్రామాల్లో సుమారు 250 మంది విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేశామని చెప్పారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు, సాక్షి దినపత్రిక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అభినందనీయం..
చిన్నకోడూరు(సిద్దిపేట): సాక్షి దినపత్రిక పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేయడం అభినందనీయమని సర్పంచ్‌లు ముక్కెర రేఖ, మాకు మహేశ్ అన్నారు. మండల పరిధిలోని గోనెపల్లి ఉన్నత పాఠశాలలో ఏడుగురు పదోతరగతి విద్యార్థులకు గురువారం ఓబులాపూర్ సర్పంచ్ ముక్కెర రేఖ, శంకరాయకుంట సర్పంచ్ మాకు మహేశ్ నలుగురికి సాక్షి స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ స్టడీ మెటీరియల్‌తో రానున్న వార్షిక పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించే అవకాశం ఉందన్నారు. రూ. 250కే స్టడీ మెటీరియల్ అందించడం సంతోషకరమని, విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సాక్షి సిబ్బంది పాల్గొన్నారు.
అంబిటస్‌లో..
సిద్దిపేటజోన్: జిల్లా కేంద్రంలోని అంబిటస్ హైస్కూల్ విద్యార్థులకు గురువారం సాక్షి స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. సాక్షి రూపొందించిన స్టడీ మెటీరియల్ పదో తరగతి విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రిన్సిపాల్ జ్యోతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


