రెండోసారి ఆ కుటుంబానిదే విజయం
నర్సాపూర్: మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత రెండు సార్లు జరిగిన ఎన్నికల్లో పట్టణంలోని 15వ వార్డు నుంచి రెండు కుటుంబాల మధ్య పోటీ జరగగా, ఒకే కుటుంబాన్ని రెండు సార్లు విజయం వరించింది. మొదటి సారి జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి పంబల్ల లలిత, కాంగ్రెస్ నుంచి వంకమల్ల ఊర్మిళ పోటీ పడగా లలిత గెలుపొందారు. కాగా ప్రస్తుతం ఆ రెండు కుటుంబాల నుంచి ఇద్దరు మహిళలు రంగంలో నిలిచినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి మారారు. గతంలో కాంగ్రెస్ నుంచి వంకమల్ల ఊర్మిళ పోటీ చేయగా ఈసారి ఆమెకు బదులుగా ఆమె కోడలు జ్యోతి కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచింది. బీఆర్‌ఎస్ నుంచి లలిత పోటీ చేశారు. కాగా వారిద్దరికీ సమానంగా ఓట్లు రావడంతో అధికారులు డ్రా తీయగా మళ్లీ లలితను విజయం వరించింది.


