టెక్నాలజీ అందుబాటులో ఉన్నా..
ప్రస్తుత కాలంలో వన్యప్రాణుల కదలికలను గుర్తించేందుకు అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో ఉన్నప్పటికి మన అటవీ అధికారులు పాదముద్రలు, విసర్జితాలు వంటి వాటిపై మాత్రమే ఆధారపడుతున్నారు. అది దాని స్థావరాలను మార్చుకుంటూ తిరుగుతోంది. ఇప్పటి వరకు పట్టుకుని దట్టమైన అటవీ ప్రాంతానికి తరలించలేకపోయారు. ఇప్పటికై నా అటవీ అధికారులు పులిని సురక్షితంగా అటవీ ప్రాంతానికి తరలించాలని ప్రజలు, వన్యప్రాణి నిపుణులు కోరుతున్నారు. పులి సంచరించిన ప్రాంతాలను, దాని పాద ముద్రలను గురువారం సీపీ రష్మీ పెరుమాళ్ పరిశీలించారు. డీఎఫ్‌ఓ పద్మజ రాణిని వివరాలు అడిగితెలుసుకున్నారు.


