కేంద్రాలను సందర్శించి.. పోలింగ్‌ను పరిశీలించి
పోలింగ్ కేంద్రాల్లో సదుపాయాలపై కలెక్టర్ ప్రావీణ్య సంతృప్తి
సంగారెడ్డి : సంగారెడ్డి మున్సిపాలిటీలోని 31వ వార్డు పరిధిలో విద్యానగర్‌లోని సెయింట్ ఆంథోనీ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.ప్రావీణ్య సందర్శించి పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు.ఈ సందర్భంగా ఓటర్ జాబితా, ఓటర్ కంపార్ట్‌మెంట్, బ్యాలెట్ బాక్స్ తదితర ఏర్పాట్లను పరిశీలించి పోలింగ్ కేంద్రం లోపల, బయట భద్రతా ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలను తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రాల్లో కల్పించిన సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని పదకొండు మున్సిపాలిటీలలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు కొనసాగిందని తెలిపారు. అనంతరం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ కంట్రోల్ రూమ్‌ను నుంచి వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న పోలింగ్ తీరుతెన్నులను పరిశీలించారు.


