రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక

Feb 11 2026 8:49 AM | Updated on Feb 11 2026 8:49 AM

రాష్ట

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక

కల్హేర్‌(నారాయణఖేడ్‌): మండలంలోని కృష్ణాపూర్‌ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినులు రాష్ట్ర స్థాయి కబడ్డీ, ఖోఖో పోటీలకు ఎంపికయ్యారని హెచ్‌ఎం సుధాకర్‌ మంగళవారం తెలిపారు. జిల్లా స్థాయిలో జరిగిన సీఎం కప్‌ కబడ్డీ పోటీల్లో పాఠశాలకు చెందిన 10వ తర గతి విద్యార్థి జన్ముల వర్ష, 9వ తరగతి విద్యార్థి డి.ముస్కాన్‌ ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని చెప్పారు. 9వ తరగతి విద్యార్థినులు చాకలి హరిత, చాకలి సౌమ్య ఖోఖో పోటీల్లో ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారని తెలిపారు. పీఈటీ రాములు, విద్యార్థులను అభినందించారు.

రాష్ట్రస్థాయికి

ఎంపికై న శ్రీవైష్ణవి

జోగిపేట(అందోల్‌): సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన 2వ సీజన్‌ సీఎం కప్‌ జిల్లా స్థాయి పోటీల్లో అందోల్‌ గ్రామానికి చెందిన పూజారి శ్రీ వైష్ణవి ఉష్షు మార్షల్‌ ఆర్ట్స్‌ క్రీడలో బంగారు పతకం సాధించింది. దీంతో ఈనెల 20 నుంచి 24 వరకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించే రాష్ట్రస్థాయి సీఎం కప్‌ పోటీల్లో పాల్గొననున్నట్లు మాస్టర్‌ మురళి తెలిపారు. బంగారు పతకాన్ని సాధించిన విద్యార్థినిని జిల్లా స్సోర్ట్స్‌ ఆఫీసర్‌ అఖిలేశ్‌ రెడ్డి, ఉష్షు క్రీడా ఉమ్మడి మెదక్‌ జిల్లా జనరల్‌ సెక్రెటరీ పోచయ్య అభినందించారు. కిక్‌ బాక్సింగ్‌లో ఆకాంక్ష, హర్షిని వెండి పతకాలు సాధించారు.

మందుబాబుకు జైలు శిక్ష

సిద్దిపేటకమాన్‌: మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన మందుబాబుకు సిద్దిపేట కోర్టు జైలు శిక్ష విధించింది. సిద్దిపేట వన్‌ టౌన్‌ సీఐ వాసుదేవరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని ముస్తాబాద్‌ చౌరస్తాలో తమ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ నిర్వహించారు. తనిఖీల్లో తిరుపతిరెడ్డి మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. దీంతో అతడిని కోర్టులో హాజరుపర్చగా మంగళవారం విచారణ జరిపిన న్యాయమూర్తి అతడికి ఐదు రోజుల జైలు శిక్ష విధించినట్లు సీఐ తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.

చందాపూర్‌ వాగులో

అస్థిపంజరం

చిన్నశంకరంపేట(మెదక్‌): మండల పరిధి చందాపూర్‌ గ్రామ శివారు వాగులో మంగళవారం గుర్తు తెలియని మహిళ అస్థిపంజరం గుర్తించినట్లు పోలీస్‌లు తెలిపారు. చిన్నశంకరంపేట ఎస్‌ఐ నారాయణగౌడ్‌ కథనం ప్రకారం.. అస్తిపంజరం గుర్తించిన గ్రామస్తులు పోలీస్‌లకు సమాచారం అందించారు. పక్కనే చీర, జాకెట్‌తో పాటు పుస్తె లభించినట్లు చెప్పారు. గత ఏడాది ఆగస్టులో చందాపూర్‌కు వచ్చి తప్పిపోయిన మనోహరబాద్‌ మండలం పరికిబండకి చెందిన కవితగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

గజ్వేల్‌రూరల్‌: జీవితంపై విరక్తితో ఓ వ్యక్తి ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన గజ్వేల్‌ మున్సిపాలిటీ పరిధిలోని క్యాసారంలో చోటు చేసుకుంది. కప్ప రాంచంద్రం(42)కు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆర్థిక సమస్యలతో దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో ఐదేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న రాంచంద్రం మనోవేదనకు గురై మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తి చెందిన రాంచంద్రం ఈ నెల 6న సాయంత్రం వేళ ఇంటివద్ద ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే గజ్వేల్‌ ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మున్సిపాలిటీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

పటాన్‌చెరు టౌన్‌: ఇస్నాపూర్‌, ఇంద్రేశం మున్సిపాలిటీలలో ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలో 26 వార్డులకు 60 పోలింగ్‌ కేంద్రాలకు ఏర్పాటు చేశారు. ఇస్నాపూర్‌లో మొత్తం 35,911 మంది తమ ఓటు హక్కును వినియోగించు కోనున్నారు. ఇంద్రే శం మున్సిపాలిటీ పరిధిలో 18 వార్డులకుగాను 19 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయగా..13,085 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక 1
1/2

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక 2
2/2

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement