దావత్‌ల జోరు
న్యూస్‌రీల్
నగర శివారు మున్సిపాలిటీల్లోధన ప్రవాహం
ఖరీదైన బ్రాండ్‌ల మద్యం పంపిణీ..
ప్రచారానికి తెర.. పెద్ద ఎత్తునప్రలోభాలకు ఎర
చైర్మన్ గిరి..నేతల గురి సదాశివపేట చైర్‌పర్సన్ పదవి జనరల్ మహిళకు రిజర్వు కావడంతో ఆసక్తి పెరిగింది. వివరాలు 8లో u
ప్రలోభాల హోరు..
మున్సిపల్ పోరు క్లైమాక్స్‌కు చేరింది. ఎన్నికల ప్రచారానికి గడువు సోమవారం సాయంత్రం ఐదు గంటలతో ముగియడంతో అభ్యర్థులు ఓటర్లను ప్రలోభపెట్టే పనుల్లో నిమగ్నమయ్యారు. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు పెద్ద మొత్తంలో నగదు పంపిణీ చేస్తున్నారు. ఒక్కో ఓటుకు కనీసం రూ.రెండు వేల నుంచి రూ.ఐదు వేల వరకు పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రధానంగా నగర శివారుల్లో ఉన్న మున్సిపాలిటీలు ఇస్నాపూర్, ఇంద్రేశం వంటి మున్సిపాలిటీల్లో అభ్యర్థులు ఓటుకు రూ.పది వేల వరకు ఇచ్చేందుకు కూడా వెనుకాడటం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులుగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు, కాంట్రాక్టర్లు, వారి కుటుంబసభ్యులను అభ్యర్థులుగా బరిలోకి దింపారు. దీంతో ఈ మున్సిపాలిటీల్లో పెద్ద మొత్తంలో ధన ప్రవాహానికి తెరలేపారనేది బహిరంగ రహస్యంగా మారింది. – సాక్షిప్రతినిధి, సంగారెడ్డి
ఓఆర్‌ఆర్‌కు సమీపంలో ఉన్న జిన్నారం, గుమ్మడిదల, గడ్డపోతారం మున్సిపాలిటీల్లోనూ పెద్ద ఎత్తున డబ్బుల పంపిణీకి అభ్యర్థులు సిద్ధమయ్యారు. సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, అందోల్, నారాయణఖేడ్, కోహీర్ వంటి మున్సిపాలిటీల్లోనూ డబ్బులు పంపిణీ చేసేందుకు అభ్యర్థులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రధానంగా ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు, కొన్ని చోట్ల స్వతంత్రులుగా బరిలోకి దిగిన వారు కూడా ప్రధాన పార్టీల అభ్యర్థులకు దీటుగా తాయిలాలు పంపిణీ చేసేందుకు సై అంటున్నారు.
గంప గుత్తా ఓట్ల కోసం ప్రయత్నాలు
మద్యం పంపిణీ జోరందుకుంది. నాలుగైదు రోజులుగా అభ్యర్థులు తమ వార్డుల్లో మద్యం పంపిణీ చేస్తూనే ఉన్నారు. వారం రోజులుగా మద్యంతో దావత్‌లు కొనసాగుతున్నాయి. అయితే శివారు మున్సిపాలిటీల్లో మద్యం విందులు ఆసక్తికరంగా మారాయి. సాధారణ బ్రాండ్లు మద్యాన్ని ఓటర్లు తాగడం లేదు. ఖరీదైన బ్రాండ్‌లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. చివరి రోజుల మద్యం ప్రవాహం మరింత ఉధృతమవుతోంది. కొందరు అభ్యర్థులు ఆదివారం రోజు వార్డుల్లోని ఇంటింటికి మాంసం కూడా పంపిణీ చేశారు. మహిళా ఓట ర్లను ప్రసన్నం చేసుకునేందు కు చీరలు, ఇతర గృహోపకరణాలను కూడా పంపిణీ చేస్తున్నారు. మరోవైపు గల్లీల్లో ఉండే యువ ఓటర్లను కూడా విందుల్లో ముంచెత్తున్నారు.
ముగిసిన ప్రచారం..
అభ్యర్థులు పది రోజులుగా వార్డుల్లో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. ఓటర్లను కలిసి తమను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. మైకుల్లో అభ్యర్థుల పాటలు హోరెత్తాయి. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసున్న ప్రధాన పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. ప్రధాన పార్టీల విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయం వేడెక్కింది. ఎమ్మెల్యే హరీశ్‌రావు, మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ రఘునందన్‌రావు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎమ్మెల్యే చింతప్రభాకర్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి వంటి నాయకులు ఆయా మున్సిపాలిటీలో రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్‌ల్లో పాల్గొన్నారు. మొత్తానికి బల్దియా ఎన్నికల ప్రక్రియలో చివరి కీలక ప్రచార ఘట్టం ముగిసింది.
ఓటుకు రూ.ఐదు వేల నుంచిరూ.పది వేలు!
దావత్‌ల జోరు
దావత్‌ల జోరు


