ఆరోగ్యరంగ ఆవిష్కరణలో ప్రేరణగా దేశం | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యరంగ ఆవిష్కరణలో ప్రేరణగా దేశం

Feb 6 2026 7:14 AM | Updated on Feb 6 2026 7:14 AM

ఆరోగ్యరంగ ఆవిష్కరణలో ప్రేరణగా దేశం

ఆరోగ్యరంగ ఆవిష్కరణలో ప్రేరణగా దేశం

ఐఐటీహెచ్‌లో జరిగిన సదస్సులో వక్తలు

ఐఐటీహెచ్‌లో జరిగిన సదస్సులో వక్తలు

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : ఆరోగ్య పరిశోధన రంగంలో కృత్రిమ మేథ (ఏఐ) సాంకేతికత, నూతన ఆవిష్కరణలకు భారతదేశం ప్రేరణగా నిలుస్తోందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ‘‘ఆరోగ్య రంగం పరిశోధనల్లో సాంకేతికత –పురోగతులు’అంశంపై ఐఐటీ హైదరాబాద్‌లో మూడురోజుల సదస్సు జరిగింది. ఎన్‌ఐటీ రాయ్‌పూర్‌, రాయ్‌చూర్‌, ధ్వారాడ్‌ ట్రిపుల్‌ఐటీలు, పండిత్‌ రవిశంకర్‌శుక్లా వర్సిటీ, ఏపీలోని కేంద్ర విశ్వవిద్యాలయాలకు చెందిన పలువురు ఫ్రొఫెసర్లు ఈ సదస్సులో పాల్గొన్నారు. మాస్‌ స్పెక్టోమిటరీ– బేస్డ్‌ మెటబోలమిక్స్‌ ఫర్‌ ట్రాన్స్‌లేషనల్‌ రీసెర్చ్‌, వివో ఇమేజింగ్‌ ఫర్‌ థెరఫ్యూటిక్స్‌, ఎలక్ట్రోన్‌సీఫాలాగ్రఫీ (ఈఈజీ), న్యూరోమాడ్యులేషన్‌, క్లినికల్‌ ఏఐ డిప్లయేబిలిటీ వంటి అంశాలపై ఈ సదస్సులో చర్చ జరిగింది. కార్యక్రమంలో ఐఐటీహెచ్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బీఎస్‌.మూర్తి, ఆరోగ్యరంగ పరిశోధన శాస్త్రవేత్తలు శేఖర్‌ సి.మండే, డాక్టర్‌ కుమారస్వామితంగరాజ్‌, హేమలతబలరామ్‌, డాక్టర్‌ స్వస్తి, డా.చిత్తరంజన్‌పాత్ర, ప్రొ.వి.శ్రీనివాస చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement