●దుమ్మురేగుతోంది.. | - | Sakshi
Sakshi News home page

●దుమ్మురేగుతోంది..

Feb 4 2026 8:44 AM | Updated on Feb 4 2026 8:44 AM

●దుమ్

●దుమ్మురేగుతోంది..

నిర్వహణ లోపం.. వాహనదారులకు శాపం

సంగారెడ్డి జోన్‌: జాతీయ రహదారి గ్రామీణ రోడ్డును తలపిస్తుంది. హైదరాబాద్‌ నుంచి ముంబై వెళ్లే జాతీయ రహదారి నిర్వహణ పనులు సరిగా చేపట్టకపోవడంతో వాహనదారులకు శాపంగా మారింది. సంగారెడ్డి నుంచి ముంబై వెళ్లే రహదారి డివైడర్‌లో ఇటీవల నిర్వహణ పనులు చేపట్టారు. అందులో భాగంగా డివైడర్‌ పక్కనే వేసిన మట్టి దిబ్బలు తొలగించడంలో విఫలమయ్యారు. భారీ వాహనాలు వెళ్లే క్రమంలో దుమ్ము, ధూళితో నిండిపోతుంది. వెనక నుంచి వచ్చే వాహనదారులకు ముందున్న వాహనాలు కనిపించక అయోమయానికి గురవుతున్నారు. అంతేకాకుండా ద్విచక్ర వాహనదారులకు కళ్లలో దుమ్ము పడి తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని నిర్వహణ పనులు చేపట్టి, మట్టి కుప్పలు తొలగించాలని కోరుతున్నారు.

●దుమ్మురేగుతోంది..1
1/1

●దుమ్మురేగుతోంది..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement