ప్రతిభ పరీక్షకు విద్యార్థిని ఎంపిక
మద్దూరు(హుస్నాబాద్): రాష్ట్ర స్థాయి సాంఘీకశాస్త్ర ప్రతిభ పరీక్షకు దూల్మిట్ట మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలకు చెందిన బి.వర్షిని ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు కరుణాకర్‌రెడ్డి తెలిపారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీల్లో విద్యార్థిని మూడోస్థానం సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపికై ంద న్నారు. అనంతరం సాంఘీకశాస్త్ర ఉపాధ్యాయురా లు, విద్యార్థినిని ఉపాధ్యాయులు అభినందించారు.
జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు..
పాపన్నపేట(మెదక్): మండల పరిధిలోని లింగాయపల్లి– చీకోడ్ ఉన్నత పాఠశాల విద్యార్థి సుంగా గణేశ్ జాతీయస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికయ్యాడు. కామారెడ్డిలో జరిగిన రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. టీచర్ రాందాస్ గైడ్‌గా వ్యవహరించారు. విద్యార్థి జాతీయ స్థాయికి ఎంపిక కావడంపై డీఈఓ విజయ, సైన్స్ అధికారి రాజిరెడ్డి, ఏఎంఓ సుదర్శణమూర్తి, మండల విద్యాధికారి ప్రతాప్‌రెడ్డి, హెచ్‌ఎం విజయలక్ష్మి అభినందనలు తెలిపారు.
ప్రతిభ పరీక్షకు విద్యార్థిని ఎంపిక


