●పొద్దు తిరుగుడు సాగు లాభదాయకం
చిన్నకోడూరు(సిద్దిపేట): పొద్దు తిరుగుడు సాగులో సస్యరక్షణ పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని శాస్త్రవేత్త డా.పల్లవి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని మాచాపూర్‌లో జాతీయ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ సీడ్స్ పథకం ద్వారా యాసంగి పొద్దు తిరుగుడు సాగుపై అవగాహన కల్పించారు. క్షేత్ర స్థాయిలో పంటలను పరిశీలించారు. దిగుబడి పెరగడంలో విత్తన ఎంపిక, విత్తే పద్ధతి, విత్తే దూరం, ఎరువులు, నీటి యాజమాన్యం, తాలు గింజలు ఏర్పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సలహాలు, సూచనలు చేశారు. తెగుళ్ల నివారణ, జాగ్రత్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ పద్మ, తహసీల్దార్ సలీమ్, మండల వ్యవసాయ శాఖ అధికారి జయంత్, ఎఫ్‌పీఓ చైర్మన్ వెంకట్ రెడ్డి, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.
శాస్త్రవేత్త డాక్టర్ పల్లవి


