మున్సిపల్ పదనిసలు
మొదటిసారి బీజేపీ బోణీ
నారాయణఖేడ్: ఖేడ్ మున్సిపాలిటీగా అవతరించిన ఇన్నేళ్లలో తొలిసారి పురపోరులో బీజేపీ బోణీ కొట్టింది. మొదటి వార్డు కౌన్సిలర్‌గా బీజేపీ అభ్యర్థి పత్రి లలిత 142 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ఈమెకు 531 ఓట్లు లభించగా సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మేటి సంగొండ మాధవి 389 ఓట్లు పొందారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి 238 ఓట్లు, సీపీఐ అభ్యర్థి బసాపురం లక్ష్మి 11, స్వతంత్ర అభ్యర్థి చాప్టా నిఖిత 59ఓట్లు పొందారు. కాగా బీజేపీ తొలిసారి ఖేడ్‌లో గెలుపొంది కౌన్సిలర్‌గా అడుగుపెట్టనున్నారు.


