భార్య కాపురానికి రావడంలేదని..
భర్త ఆత్మహత్య
కొండపాక(గజ్వేల్): భార్య కాపురానికి రావడంలేదని మనస్తాపంలో భర్త ఆత్మ హత్య చేసుకున్నాడు. త్రీ టౌన్ సీఐ లక్ష్మిబాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొండపాక మండలం మర్పడ్గ గ్రామానికి చెందిన మరియాల అశోక్(43)తో బూర్గుపల్లికి చెందిన సంజనకు కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. కొన్ని నెలలుగా సంసారం విషయంలో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రెండు నెలల కిందట సంజన ఇద్దరు పిల్లలను తీసుకొని తల్లిగారింటికి వెళ్లి తిరిగి రావడం లేదు. దీంతో అశోక్ తీవ్ర మనస్తాపానికి గురై శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లి వీరమణి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.
చోరీ కేసులో ఇద్దరు అరెస్ట్
టేక్మాల్(మెదక్): దారిదోపిడీ కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం మండల పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ అరవింద్‌కుమార్ కేసు వివరాలు వెల్లడించారు. మండలంలోని తంప్లూర్ గ్రామానికి చెందిన ఇటిక్యాల శ్యామల వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి వస్తుంది. ఇద్దరు వ్యక్తులు ఆమెను అడ్డగించి మెడలోని పుస్తెలతాడును తెంపుకొని పారిపోతుండగా శ్యామల కేకలు వేసింది. అక్కడే పనులు చేస్తున్న రైతులు అప్రమత్తమై ఒకరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కాగా నిందితుడ్ని విచారించగా కామారెడ్డి జిల్లా బిర్కూర్ మండలం మిర్జాపూర్‌కు చెందిన కడమంచి పాపయ్య, అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ గ్రామానికి చెందిన తూర్పాటి పోచయ్య దొంగతనం చేసినట్లు విచారణలో ఒప్పుకున్నారు. దీంతో ఆ ఇద్దరిని రిమాండ్‌కు పంపించారు.
భార్య కాపురానికి రావడంలేదని..


