ఏఐ కన్నా వ్యవసాయానికే భవిష్యత్తు
విజ్ఞానజ్యోతి అధ్యక్షుడు సురేష్‌బాబు
విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రదానం
కౌడిపల్లి(నర్సాపూర్): ఆర్టిఫియల్ ఇంటెలిజెన్సీ (ఏఐ) కన్నా వ్యవసాయానికే ఎక్కువ భవిష్యత్ ఉంటుందని విజ్ఞానజ్యోతి విద్యసంస్థల అధ్యక్షుడు, ప్రముఖ నిర్మాత డి సురేష్‌బాబు తెలిపారు. గురువారం మండలంలోని తునికివద్దగల రామానాయుడు విజ్ఞానజ్యోతి గ్రామీణాభివృద్ధి విద్యా సంస్థ, వ్యవసాయ కళాశాలలో ఆరునెలల వ్యవసాయ శిక్షణ పూర్తి చేసుకున్న 30మంది విద్యార్థులకు సర్టిఫికెట్ల అందజేశారు. అలాగే.. వ్యవసాయ కళాశాల విద్యార్థుల వార్షికోత్సవ కార్యక్రమానికి సురేష్‌బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ విద్యకు మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. జనానికి మంచి ఆహారం అందించేందుకుం ప్రతి ఒక్కరూ వ్యవసాయం చేయాలన్నారు. డ్రోన్, రోబో టెక్నాలజీ సైతం వ్యవసాయంలో వినియోగం పెరుగుతుందన్నారు. మంచి పంట లు పండించాలన్న ఆలోచనలో ఉండన్నారు. విద్యార్థులకు విజ్ఞానజ్యోతి అండగా ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా 20మంది విద్యార్థులకు ఫ్యూరోనేచురల్ సంస్థ సీఎఫ్‌ఓ సామ్యుల్‌రాజ్ ఉద్యోగాలు ఇచ్చారని చెప్పారు. కార్యక్రమంలో నూజివీడు సీడ్స్ ప్రతినిధి శ్రీనివాస్, హెచ్‌ఎం క్లాస్ ప్రతినిఽధులు గొగాయి, చేతన్‌కుమార్, విజ్ఞానజ్యోతి చైర్మన్ అచ్యుతరాంప్రసాద్, సీఈఓ అనురాధ, డీఎన్ రావ్, గౌతంరెడ్డి, గోపాలరావ్, డైరెక్టర్ దేవెందర్‌రెడ్డి, పీల్డ్ సూపర్‌వైజర్ జగదీష్ పాల్గొన్నారు.


