వడ్డెరులందరికీ ఇళ్ల పట్టాలు
మంత్రి దామోదర రాజనర్సింహ
జోగిపేట(అందోల్): అందోలు–జోగిపేట మున్సిపాలిటీ ఫరిధిలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.వందల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, గత ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు.అందోల్–జోగిపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో కలసి ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక వడ్డెరులతో సమావేశమై 56 మందికి ఇంటి పట్టాలు, కమ్యూనిటీ హాలు నిర్మాణం చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు. స్థానికంగా మహిళలకు ఉపాధి కల్పించేందుకు కుటీర పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు.
రాష్ట్రస్థాయి అబాకస్ పోటీల్లో తృతీయ స్థానం
జిన్నారం (పటాన్‌చెరు): బొల్లారం డివిజన్ పరిధిలోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన మూడో తరగతి విద్యార్థి దీక్షిత రాష్ట్రస్థాయి అబాకస్ పోటీల్లో తృతీయ స్థానంలో నిలిచి సత్తా చాటింది. గణిత శాస్త్రంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. విద్యార్థిని ప్రతిభను కొనియాడుతూ నిర్వాహకులు షీల్డ్‌తో పాటు ప్రశంసాపత్రాన్ని అందజేశారు. పాఠశాలకు గర్వకారణంగా నిలిచిన విద్యార్థిని దీక్షితను కరస్పాండెంట్ లోకనాథం, ప్రిన్సిపాల్ హైమావతి అభినందించారు.


