స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోండి
దుబ్బాకటౌన్: పట్టణంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా, ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీస్ సిబ్బందితో కవాతు నిర్వహించినట్లు ఎన్నికల పరిశీలకురాలు ఆయేషా ఫాతిమా అన్నారు. శుక్రవారం దుబ్బాక పట్టణంలోని ప్రధాన వీధుల గుండా పోలీసులతో కవాత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేందుకు ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు పోలీస్ సిబ్బందికి సహకరించాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏసీపీ రవీందర్‌రెడ్డి, సీఐ రాజేశ్, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.


