గసగసాల పొడి సీజ్‌.. వ్యక్తి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

గసగసాల పొడి సీజ్‌.. వ్యక్తి అరెస్ట్‌

Feb 9 2026 8:54 AM | Updated on Feb 9 2026 8:54 AM

గసగసాల పొడి సీజ్‌.. వ్యక్తి అరెస్ట్‌

గసగసాల పొడి సీజ్‌.. వ్యక్తి అరెస్ట్‌

నారాయణఖేడ్‌: మాదక ద్రవ్యాలకు సంబంధించిన రూ.22 వేల విలువచేసే 300 గ్రాముల గసగసాల పొడిని ఎకై ్సజ్‌ అధికారులు స్వాధీనం చేసుకొని, వ్యక్తిని అరెస్టు చేశారు. ఖేడ్‌ ఎకై ్సజ్‌ సీఐ రఘునాథ్‌ రెడ్డి వివరాల ప్రకారం... రాజస్థాన్‌కు చెందిన భగీరథ స్థానికంగా హెచ్‌పీ గ్యాస్‌ సిలిండర్ల డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం రాత్రి ఎకై ్సజ్‌ అధికారులు నిజాంపేటలో దాడిచేసి భగీరథ నుంచి 300 గ్రాముల గసగసాల (ఓపీఎం పొడి) మొక్కలకు చెందిన ఎండబెట్టిన కాయల పొడిని స్వాధీనం చేసుకున్నారు. సీజ్‌ చేసిన పొడిని రసాయన పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు. ఖేడ్‌ డివిజన్‌ పరిధిలో ఇలాంటి కేసు నమోదవ్వడం ఇదే మొదటిసారి. కాగా ఎన్డీపీఎస్‌ చట్టం కింద కేసు నమోదు చేసి పొడిని సీజ్‌ చేసి నిందితుడిని అరెస్టు చేశారు. గసగసాల పొడిని స్థానికంగా విక్రయం కోసం తెచ్చాడా? లేక ఇతర ప్రాంతాలకు తరలించే ఉద్దేశంతో తెచ్చాడా? అనే కోణాల్లో విచారణ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement