సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిశీలన
పర్యటించిన సీపీ రష్మీ పెరుమాళ్
హుస్నాబాద్: పట్టణంలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల ఏర్పాట్లను ఆదివారం సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్ పరిశీలించారు. అనంతరం ఆమె ఎన్నికలు ప్రశాంతంగా, నిషృక్ష పాతంగా నిర్వహించేందుకు తీసుకుంటున్న భద్రతా చర్యలను స్వయంగా పరిశీలించారు. అలాగే వివిధ పోలింగ్ కేంద్రాలను సందర్శించి, ఓటర్లకు కల్పించాల్సిన కనీస సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. అలాగే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ప్రత్యేకంగా సందర్శించారు. ఎన్నికల కోడ్ అమలును పటిష్టంగా పర్యవేక్షించాలని, మద్యం, నగదు పంపిణీ వంటి అక్రమాలను అడ్డుకోవడానికి తనిఖీలు ముమ్మరంగా చేయాలని పోలీసులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏసీపీ సదానందం, ఎస్‌ఐ లక్ష్మారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
విద్యుదాఘాతంతో
రైతుకు గాయాలు
నిజాంపేట(మెదక్): విద్యుత్ షాక్ తగిలి రైతుకు గాయాలయ్యాయి. ఈ సంఘటన మండల పరిధిలోని రజాక్‌పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా... ఆదివారం గ్రామానికి చెందిన ఒజ్జే పర్శరాములు వ్యవసాయ పనుల నిమిత్తం సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్ వద్ద పీజ్ వైర్ వేస్తుండగా ప్రమాదం జరిగింది. వెంటనే కుటుంబీకులు గమనించి అంబులెన్స్‌లో సిద్దిపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిశీలన


