రూ. లక్ష తీసుకో.. సోడా మెషీన్ కొనుక్కో
సదాశివపేట పాదయాత్రలో మహిళకు జగ్గారెడ్డి సాయం
సదాశివపేట(సంగారెడ్డి): టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు పట్టణ నాయకులు కార్యకర్తలతో కలిసి గురువారం శంభులింగేశ్వర మందిరం నుంచి గొల్లకేరీ, బస్టాండ్, సుభాష్‌రోడ్డు, శాసీ్త్రరోడ్ల మీదుగా పాదయాత్ర చేశారు. శంభులింగేశ్వర మందిరం సమీపంలో కారు దిగి నడుచుకుంటూ వెళ్తుండగా అక్కడ సోడా బండిపై నిమ్మరసం అమ్ముకునే మహిళ కనిపించింది. ఆమె దగ్గర జగ్గారెడ్డి సోడా కొనుక్కుని తాగుతూ రోజుకు ఎంత సంపాదిస్తున్నావని అడిగి తెలుకున్నారు. సోడా మెషీన్ ఉంటే ఇంకా ఎక్కువ సంపాదిస్తానని సదరు మహిళ చెప్పగా..సోడా మెషీన్ ధర ఎంత ఉంటుందో అనుచరులను కనుక్కుని వెంటనే ఆ మహిళకు రూ.లక్ష ఇచ్చేశారు. సోడా మెషీన్ కొనుక్కుని ఇంకా ఎక్కువ సంపాదించుకోవాలని జగ్గారెడ్డి సదరు మహిళకు సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు శంకర్‌గౌడ్,జైగౌడ్, కొత్తగొల్ల శేఖర్, అరుణ్, చిరు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


