కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య తోపులాట | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య తోపులాట

Feb 9 2026 8:54 AM | Updated on Feb 9 2026 8:54 AM

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య తోపులాట

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య తోపులాట

తూప్రాన్‌: మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకుల మధ్య ఆదివారం పట్టణ కేంద్రంలో తోపులాట చోటు చేసుకుంది. వివరాలు ఇలా... పట్టణంలో మైనార్టీ ఓటర్లు అధికంగా ఉన్న 1, 15వ వార్డుల్లో స్థానిక బీఆర్‌ఎస్‌ నాయకులు.. ఓటర్లను ఆకట్టుకునేందుకు హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఆ పార్టీ మైనార్టీ హెచ్‌వైసీ నాయకుడు సల్మాన్‌ఖాన్‌తో ప్రచారం చేపట్టారు. దీంతో స్థానికంగా కాంగ్రెస్‌ నుంచి మైనార్టీలమే పోటీలో ఉండగా తమకు వ్యతిరేకంగా ఏ విధంగా ప్రచారం చేస్తారని కాంగ్రెస్‌ నాయకులు ప్రశ్నించారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నాయకులను చెదరగొట్టి సల్మాన్‌ఖాన్‌ను అక్కడి నుంచి పంపించారు. దీంతో సమస్య సద్దుమనిగింది.

కాంగ్రెస్‌, జనసేన వర్గాల మధ్య ఘర్షణ

జిన్నారం (పటాన్‌చెరు): మున్సిపల్‌ ఎన్నికల వేళ కాంగ్రెస్‌, జనసేన వర్గాల మధ్య ప్రచారం ఘర్షణకు దారితీసింది. ఆదివారం గడ్డపోతారం మున్సిపాలి టీ 4వ వార్డులో జనసేన అభ్యర్థి ఓటర్లను కలిసి డబ్బులు పింపిణీ చేస్తున్నారన్న సమాచారంతో కాంగ్రెస్‌ అభ్యర్థికి సంబంధించిన వ్యక్తులు వారితో గొడవకు దిగారు. ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. దీంతో ఇరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఎన్నికల నియమాలు ఉల్లంఘించొద్దని పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పి పంపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement