ప్రభుత్వ ఆస్పత్రిలో అరుదైన ఆపరేషన్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఆస్పత్రిలో అరుదైన ఆపరేషన్‌

Feb 6 2026 7:21 AM | Updated on Feb 6 2026 7:21 AM

ప్రభుత్వ ఆస్పత్రిలో అరుదైన ఆపరేషన్‌

ప్రభుత్వ ఆస్పత్రిలో అరుదైన ఆపరేషన్‌

మహిళకు గర్భసంచితో పాటు

2.5 కిలోల గడ్డ తొలగింపు

దుబ్బాక: దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం వైద్యులు మహిళకు అరుదైన ఆపరేషన్‌ చేసి ప్రాణాలు కాపాడారు. కడుపు నొప్పితో బాధపడుతున్న మహిళకు శస్త్ర చికిత్స నిర్వహించి ఆమె కడుపులోంచి 2.5 కిలోల ఓవరియాన్‌ గడ్డతో పాటు గర్భసంచిని తొలగించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ హేమరాజ్‌సింగ్‌ సమాచారం మేరకు... అక్బర్‌పేట–భూంపల్లి మండలం బొప్పాపూర్‌కు చెందిన అరిగె వెంకటలక్ష్మి కొన్ని రోజులుగా కడుపునొప్పితో బాధపడుతూ పలు ఆస్పత్రులకు వెళ్లినా ఫలితం లేదు. ఈ క్రమంలో తీవ్ర అస్వస్థతతో దుబ్బాక వంద పడకల ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించి రక్తం తక్కువ ఉండటంతో 3 యూనిట్స్‌ రక్తం ఎక్కించారు. అనంతరం ఆపరేషన్‌ చేసి 2.5 కిలోల ఓవరియాన్‌ గడ్డతో పాటు, గర్భసంచిని తొలగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement