రాత్రి వేళల్లోనే సంచారం
పులి పగలు దట్టమైన పొదల్లో విశ్రాంతి తీసుకుంటూ రాత్రి సమయంలో తన ప్రయాణాన్ని సాగిస్తోంది. దాదాపు ఇప్పటి వరకు 10 పశువులను తిని ఉండవచ్చని తెలుస్తోంది. సిద్దిపేట జిల్లాలో ఐదు పశువులపై దాడి చేయగా మూడు పశువులను పూర్తిగా తిన్నది. మిగతా వాటిని వదిలేసి వెళ్లడంతో వాటిని అటవీ అధికారులు పూడ్చివేశారు. పశువులను బయటకు వదలవద్దని, గుట్టల ప్రాంతాల్లో సంచరించవద్దని గుండారెడ్డిపల్లి గ్రామస్తులకు డప్పు చాటింపు వేసి సూచించారు. అలాగే పులి సురక్షితంగా పట్టుకునేందుకు ఒక బోన్‌ను ఏర్పాటు, డ్రోన్‌కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. వరంగల్, హైదరాబాద్ జూ నుంచి నిపుణులు వచ్చారు. రిస్క్యూ టీం సైతం పరిశీలిస్తున్నారు.


