వారసుల గెలుపు కోసం.. | - | Sakshi
Sakshi News home page

వారసుల గెలుపు కోసం..

Feb 6 2026 7:21 AM | Updated on Feb 6 2026 7:21 AM

వారసుల గెలుపు కోసం..

వారసుల గెలుపు కోసం..

వారసుల గెలుపు కోసం..

మాజీ చైర్మన్లు యత్నాలు

మెదక్‌ కలెక్టరేట్‌: మెదక్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో వారసత్వ పోరు కొనసాగుతోంది. ఇప్పటి వరకు మున్సిపల్‌ చైర్మన్లుగా పనిచేసిన ముగ్గురు చైర్మన్లకు కౌన్సిలర్‌గా అవకాశం ఉన్నా ఈసారి పోటీ చేయడం లేదు. కేవలం వారి వారసులను రాజకీయంగా నిలబెట్టే లక్ష్యంతో పనిచేస్తున్నారు. మున్సిపల్‌ చైర్మన్‌గా మూడు సార్లు పనిచేసిన బట్టి జగపతి తన భార్యతోపాటు కొడుకును కూడా బరిలో దించాడు. 17వ వార్డులో బట్టి జగపతి భార్య బట్టి లలిత బీఆర్‌ఎస్‌ నుంచి పోటి చేస్తుండగా.. వారి కుమారుడు బట్టి ఉదయ్‌ 29వ వార్డు నుంచి ఇదే పార్టీ తరపున బరిలో ఉన్నాడు. దీంతో వారిద్దరి గెలిపే లక్ష్యంగా బట్టి జగపతి ప్రజల్లో ఆయనకు ఉన్న పలుబడిని వాడుతున్నాడు. తొడుపునూరి చంద్రపాల్‌ గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తరపున పోటీచేసి చైర్మన్‌గా పనిచేశారు. ప్రస్తుతం రిజర్వేషన్‌ అనుకూలించక పోవడంతో ఆయన కొడుకు శివరామకృష్ణను కాంగ్రెస్‌ పార్టీ తరపున 31వ వార్డులో కౌన్సిలర్‌ బరిలోకి దింపారు. వారి సామాజిక వర్గంతోపాటు ప్రజల్లో తనకున్న ఇమేజ్‌తో కొడుకును గెలిపించే ప్రయత్నంలో ఉన్నారు. మరోవైపు మల్లికార్జున్‌గౌడ్‌ రెండుసార్లు చైర్మన్‌గా పనిచేశారు. ఈసారి పోటీచేసే అవకాశం ఉన్న వదులుకొని అతని భార్య గాయత్రిని 15వ వార్డులో బీఆర్‌ఎస్‌ తరపున నిలబెట్టారు. పార్టీ గెలిస్తే ఆమెనే మున్సిపల్‌ చైర్మన్‌గా ప్రచారం కొనసాగుతోంది. దీంతో ఆమె గెలుపే లక్ష్యంగా మాజీ చైర్మన్‌ మల్లికార్జున్‌గౌడ్‌ ప్రచారం కొనసాగిస్తున్నాడు. ఇలా ముగ్గురు మాజీ చైర్మన్లు వారి వారసుల గెలుపుకోసం ప్రచారాలు మొదలు పెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement