నేడు అప్రెంటిస్‌షిప్‌ జాబ్‌ మేళా | - | Sakshi
Sakshi News home page

నేడు అప్రెంటిస్‌షిప్‌ జాబ్‌ మేళా

Feb 9 2026 8:54 AM | Updated on Feb 9 2026 8:54 AM

నేడు

నేడు అప్రెంటిస్‌షిప్‌ జాబ్‌ మేళా

సంగారెడ్డి క్రైమ్‌: పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో సోమవారం ప్రధానమంత్రి జాతీయ శిక్షణ అప్రెంటిస్‌షిప్‌ జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్‌ తిరుపతి రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో వివిధ రంగాలకు చెందిన 10 ఇండస్ట్రియల్‌ టెక్నికల్‌ ట్రేడ్‌లు, ప్రొడక్షన్‌ తదితర వాటిలో అప్రెంటిస్‌ షిప్‌నకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఐటీఐ, ఇండస్ట్రియల్‌ ట్రైనింగ్‌, సంబంధిత టెక్నికిల్‌ను విద్యా అర్హతగా నిర్ణయించా రు. ఆసక్తిగల నిరుద్యోగులు ఉదయం 10 గంటలకు తమ సర్టిఫికెట్లు, ఆధార్‌, ధ్రువపత్రాలతో ఐటీఐ కళాశాల కార్యాలయానికి హాజరు కావాలని సూచించారు. వివరాలకు 94930 14844 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

రాష్ట్ర స్థాయికి

విద్యార్థులు ఎంపిక

సంగారెడ్డి టౌన్‌: సంగారెడ్డి మండల పరిధిలోని హనుమాన్‌ నగర్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో రెండు రోజులపాటు టెక్‌ ఫెస్టివల్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. సంగారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ఎంపికయ్యారు. అనంతరం వారికి సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ జానకి దేవి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

తడ్కపల్లి వాసికి

ఉత్తమ అవార్డు

సిద్దిపేటఅర్బన్‌: మండలంలోని తడ్కపల్లి గ్రామానికి చెందిన దుబ్బాక నవీన్‌గౌడ్‌ 2026 సంవత్సరానికి గాను జాతీయ స్థాయిలో ఉత్తమ ఔత్సాహిక పారిశ్రామిక అవార్డును అందుకున్నారు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చ ర్‌ రీసెర్చ్‌ (ఐసీఏఆర్‌), ఇండియన్‌ ఇనిస్టిట్యూ ట్‌ ఆఫ్‌ ఆయిల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 6 నుంచి 8వ తేదీ వరకు ఢిల్లీలో నిర్వహించిన జాతీయ స్థాయి కాన్ఫరెన్స్‌లో నవీన్‌ గౌడ్‌ ఈ అవార్డును అందుకున్నారు. ఆయన ‘మగధ’బ్రాండ్‌తో స్టార్టప్‌ సంస్థను ప్రారంభించి ఆర్గానిక్‌ తేనే, ఆయిల్‌ను ఉత్పత్తి చేస్తున్నాడు. వినూత్న విధానాలు అవలంభించడం, నాణ్యమైన ఉత్పత్తులు ఉత్పత్తి చేయడంతో పాటు రైతులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో చేసిన విశేష కృషికి తనకు ఈ అవార్డు వచ్చిందని నవీన్‌గౌడ్‌ పేర్కొన్నారు. గ్రామాని కి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంపై గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.

కారు, ఆటో ఢీ..

ఇద్దరికి గాయాలు

కొల్చారం(నర్సాపూర్‌): కారు ఆటోను ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరికీ గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని పోతంశెట్టిపల్లి గ్రామ శివారు మెదక్‌ నర్సాపూర్‌ జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని కొంగోడు గ్రామాని కి చెందిన మేకల అజయ్‌, మంగలి అనిల్‌ ఆటోలో మెదక్‌కు వెళ్తున్నారు. ఇదే సమయంలో మెదక్‌ వైపు నుంచి వస్తున్న కారు రహదారి పాత బ్రిడ్జి వద్ద ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న అజయ్‌, అనిల్‌కు గాయాలయ్యాయి. ఇరువురిని చికిత్స నిమిత్తం మెదక్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటన కు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

నేడు అప్రెంటిస్‌షిప్‌ జాబ్‌ మేళా 1
1/1

నేడు అప్రెంటిస్‌షిప్‌ జాబ్‌ మేళా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement