కాంగ్రెస్‌కు ఓటు అభివృద్ధికి చోటు
కోహీర్‌లో రోడ్‌షోలో మంత్రి అజహరుద్దీన్
జహీరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ ఇస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని జహీరాబాద్ పార్లమెంట్ మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జి, మంత్రి అజహరుద్దీన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఆయన కోహీర్ మున్సిపాలిటీలో గురువారం రోడ్‌షో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఇతర పార్టీలకు ఓటు వేసినా ప్రయోజనం ఉండదన్నారు. మొత్తం వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను బలపర్చాలని కోరారు. కార్యక్రమంలో మాజీమంత్రి ఎ.చంద్రశేఖర్, సెట్విన్ చైర్మన్ ఎన్.గిరిధర్‌రెడ్డి, జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఎస్.ఉజ్వల్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు రామలింగారెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా తబస్సుమ్, పట్టణ అధ్యక్షుడు శంషీర్, ఆయా వార్డుల అభ్యర్థులు పాల్గొన్నారు.


