ప్రశాంతంగా నవోదయ పరీక్ష
ఉమ్మడి జిల్లాలో 1,229 మంది హాజరు
వర్గల్(గజ్వేల్): ఉమ్మడి మెదక్ జిల్లా వర్గల్ నవోదయలో 2026–27కు గాను 9వ, 11వ తరగతుల్లో ప్రవేశానికి శనివారం నిర్వహించిన నవోదయ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్ష నిర్వహణకు గజ్వేల్, ప్రజ్ఞాపూర్, వర్గల్‌లో 8 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఉమ్మడి జిల్లా నుంచి మొత్తం 1,229 మంది హాజరయ్యారు. 11వ తరగతి ప్రవేశపరీక్షకు మొత్తం 1008 మంది అభ్యర్థులకు 727 (72.12శాతం)మంది హాజరైనట్లు నవోదయ ప్రిన్సిపాల్ రాజేందర్ తెలిపారు. అలాగే 9వ తరగతి ప్రవేశ పరీక్షకు 853 మందికి 502 (58.85 శాతం)మంది హాజరయ్యారు. పలు పరీక్ష కేంద్రాలను ఆయనతోపాటు మండల విద్యాధికారులు సందర్శించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
విద్యార్థులపై దృష్టి సారించాలి
మిరుదొడ్డి(దుబ్బాక): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి సమగ్రాభివృద్ధికి ఉపాధ్యాయులు అంకిత భావంతో పని చేయాలని జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి ముడ్రాతి రమేశ్ పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని అందె ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను సందర్శించారు. మిడ్‌లైన్ ఎఫ్‌ఏ –3 పరీక్షా పేపర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదవడం, రాయడంతో పాటు, గణిత భావాలను పెంపొందించాలన్నారు. ఈ నెలలో జాతీయ విద్యా సదస్సు జరుగుతుందని, ప్రతి పాఠశాలలో 3వ తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు.
ఏడుపాయలలో
శాశ్వత బస్ స్టేషన్
కొల్చారం(నర్సాపూర్): ఏడుపాయల ఉత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం త్వరలోనే శాశ్వత బస్ స్టేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్లు రాష్ట్ర రోడ్డు రవాణా హైదరాబాద్ జూన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కుశ్రుశాఖాన్ పేర్కొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా జరిగే ఏడుపాయల వనదుర్గాదేవి జాతరలో భాగంగా, పోతంశెట్టిపల్లి శివారులోని టీ జంక్షన్ టేకుల గడ్డ వద్ద భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేయనున్న బస్ స్టేషన్ ఏర్పాటు పనులను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు బస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. బస్ స్టేషన్ నుంచి ఆలయం వరకు ఉచిత బస్సులను నడపనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆయన వెంట మెదక్ రీజినల్ మేనేజర్ విజయ భాస్కర్, రీజినల్ డిప్యూటీ ఆర్‌ఎం కష్ణమూర్తి, డిప్యూటీ రీజినల్ ఎండీ శ్రీనివాసరావు, మెదక్ డిపో మేనేజర్ సురేఖ, డిపో సిబ్బంది పాల్గొన్నారు.
ప్రశాంతంగా నవోదయ పరీక్ష
ప్రశాంతంగా నవోదయ పరీక్ష


