స్వతంత్రుల సత్తా
పురపోరులో స్వతంత్రులు సత్తాచాటుతున్నా రు. రాజకీయ పార్టీల నడుమ స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందడం సులువు కాదు. అయినా చెమటోడ్చి గట్టి పోటీనిస్తూ గెలు స్త్తుండటం విశేషం. ఉమ్మడి మెదక్ జిల్లాలో 2020లో 15 పురపాలికలు 309 వార్డులకు జరిగిన ఎన్నికల్లో 35 మంది స్వతంత్రులు గెలుపొందారు. పలు బల్దియాల్లో చైర్మన్, వైస్ చైర్మన్‌గా వ్యవహరించారు. ఈసారి ఉమ్మడి జిల్లాలోని 19 మున్సిపాలిటీల్లో 392 మంది ఇండిపెండెంట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. – సాక్షి, సిద్దిపేట
పలు మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలోనూ ఇండిపెండెంట్లుగా గెలుపొందిన వారే కీలకంగా మారుతున్నారు. ఇండిపెండెంట్లు ప్రచా రం నిర్వహించి.. ప్రజల మన్ననలు పొంది విజయబావుటా ఎగురవేశారు. చేర్యాల మున్సిపాలిటీలో 12 వార్డులుండగా టీఆర్‌ఎస్ 5, కాంగ్రెస్ 5 వార్డుల్లో, ఇద్దరు ఇండిపెండెంట్లు గెలుపొందారు. ఇండిపెండెంట్‌గా గెలుపొందిన నిమ్మ రాజీవ్‌రెడ్డి బీఆర్‌ఎస్‌కు మద్దతు తెలపడంతో ఆ పార్టీ మున్సిపల్ చైర్మన్ గిరిని కై వసం చేసుకుంది. బీఆర్‌ఎస్‌కు మద్దతు పలికినందుకు వైస్ చైర్మన్‌గా రాజీవ్‌రెడ్డికి అవకాశం ఇచ్చారు. దుబ్బాక మున్సిపాలిటీలో 20 వార్డులకు గాను టీఆర్‌ఎస్ 9, ఇండిపెండెంట్లు 9, బీజేపీ 1, ఇతరులు 1 గెలుపొందారు. ఇండిపెండెంట్లుగా గెలుపొందిన వారు బీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో ఆ పార్టీ మున్సిపల్ పీఠం దక్కించుకుంది.
పుర బరిలో 392 మంది ఇండిపెండెంట్లు
ఉమ్మడి మెదక్ జిల్లాలో 19 మున్సిపాలిటీల్లో 1,658 మంది పోటీ చేస్తుండగా అందులో 392 మంది ఇండిపెండెంట్లు పోటీ చేస్తున్నారు. ఈ సారి జహీరాబాద్ మున్సిపాలిటీలో 58 మంది, సంగారెడ్డిలో 52, అత్యల్పంగా చేర్యాల మున్సిపాలిటీలో ఐదుగురు ఇండిపెండెంట్లు బరిలో ఉన్నారు. రాజకీయ పార్టీల కంటే ఇండిపెండెంట్ అభ్యర్థికి ఎక్కువగా ఓటర్లు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. అందుకే ఇండిపెండెంట్లు దాదాపు 15శాతం వరకు విజయం సాధిస్తున్నారు. స్వతంత్రులకు గుర్తులు కేటాయించడంతో ప్రచారంలో దూసుకపోతున్నారు. సొంత మేనిఫెస్టోతో ముందుకు వెళ్తున్నారు. ప్రచార రథాలు, ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఈసారి ఎంత మంది ఇండిపెండెంట్లు గెలుపొందుతారోనన్న చర్చ అన్ని పార్టీల్లో సాగుతోంది. ఈ నెల 11న జరిగే ఎన్నికల్లో ఎంత మంది స్వతంత్రులకు ఓటర్లు పట్టం కడతారో వేచిచూడాల్సిందే.
మున్సిపాలిటీ గత ఎన్నికల్లో గెలుపొందిన వారు
దుబ్బాక 09
హుస్నాబాద్ 03
గజ్వేల్ 06
చేర్యాల 02
అమీన్‌పూర్ 01
అందోల్–జోగిపేట్ 01
బొల్లారం 0
నారాయణఖేడ్ 0
సదాశివపేట 01
సంగారెడ్డి 03
తెల్లాపూర్ 02
మెదక్ 01
నర్సాపూర్ 03
రామాయంపేట్ 01
తూప్రాన్ 02
గత మున్సిపల్ ఎన్నికల్లో 35 మంది విజయం
గతంలో ఇండిపెండెంట్‌కు దక్కిన చేర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్
ఈసారి 19 మున్సిపాలిటీల్లో 392 మంది పోటీ ప్రస్తుత పుర బరిపై సర్వత్రా చర్చ
జిల్లా మున్సిపాలిటీలు మొత్తం స్వతంత్రులు అభ్యర్థులు
సిద్దిపేట 4 326 73
సంగారెడ్డి 11 1,045 276
మెదక్ 4 287 43


