కేసీఆర్ పాలనలోనే సంగారెడ్డి అభివృద్ధి
సదాశివపేట(సంగారెడ్డి)/సంగారెడ్డి/జహీరాబాద్/పటాన్‌చెరు టౌన్: సంగారెడ్డి పట్టణ అభివృద్ధి కేసీఆర్ హాయాంలోనే జరిగిందని, రూ.34 కోట్లతో ఇంటింటికి మంచినీళ్లు, సంగారెడ్డి పట్టణంలో రోడ్లు, సెంట్రల్ లైటింగ్, డివైడర్లు ఇలా అభివృద్ధి చేసింది కేసీఆర్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్, సదాశివపేట, సంగారెడ్డి, గడ్డపోతారం తదితర చోట్ల కార్నర్‌మీటింగ్‌లు, రోడ్‌షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ...ఆనాడు చింతా ప్రభాకర్ ఓటమి పాలైనప్పటికీ..సంగారెడ్డికి మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజీని కేసీఆరే మంజూరు చేశారని గుర్తు చేశారు. టీయూఎఫ్‌ఐడీసీ కింద రూ.50 కోట్లు, ఎస్‌డీఎఫ్ కింద రూ.25 కోట్లతో సంగారెడ్డిని అబివృద్ధి చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లయినా పట్టణంలో పైసా పనిచేసింది లేదని విమర్శించారు. ఎన్నికల కోసం మంజూరీలు, టెండర్లు లేకుండా కొబ్బరికాయలు కొట్టి ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. రెండేళ్లలో రూ.8 రూపాయలు కూడా ఇవ్వని కాంగ్రెస్ నాయకులు వార్డుకు రూ.8 కోట్లు ఇస్తామంటే ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు.
జగ్గారెడ్డిలాగా
అడ్రస్ లేకుండా పోయే రకం కాదు
స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నిత్యం క్యాంప్ ఆఫీస్‌లో ప్రజలకు అందుబాటులో ఉంటారని, జగ్గారెడ్డి మాదిరిగా అడ్రస్ లేకుండా పోయే రకం కాదని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. సంగారెడ్డి, సదాశివపేట, కోహీర్, జహీరాబాద్, నర్సాపూర్, మెదక్ ఇలా ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్ జెండానే ఎగురుతుందన్నారు. రెండేళ్లలో వచ్చే కేసీఆర్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా చింతా ప్రభాకర్ , మంత్రిగా నేను బ్యాధత తీసుకుని పట్టణాభివృద్ధికి గ్యారెంటీ తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అర్థంపర్థం లేని నిర్ణయాలతోనే రియల్‌ఎస్టేట్ రంగం కుప్పకూలిపోయి ధరలు పతనంకావడంతోనే అన్ని వ్యాపారాలు దెబ్బతిన్నాయని మండిపడ్డారు.
మాజీ మంత్రి హరీశ్‌రావు
కేసీఆర్ పాలనలోనే సంగారెడ్డి అభివృద్ధి


