డిపో పునరుద్ధరణ
దుబ్బాక బస్సు డిపోను పూర్తిస్థాయి డిపోగా పునరుద్ధరించాలి. ఇప్పుడు ఏదో వంతుగా కొన్ని బస్సులతో కొన్ని రూట్లలోనే నడుపుతుండ్రు. దుబ్బాక డిపోపై ప్రభుత్వం వివక్ష సరికాదు. 60 బస్సులు, డీఎం ఏర్పాటుతో పాటు రాష్ట్రంలోని పలు పుణ్యక్షేత్రాలతో పాటు కొత్త రూట్లలో బస్సులు వేయాలి. హుస్నాబాద్‌కు న్యాయం చేసి దుబ్బాక డిపోపై వివక్ష చూపడం చాలా బాధగా ఉంది. –రాజేశ్
మురుగునీటి శుద్ధి
పట్టణంలోని చెరువుల్లోకి డ్రైనేజీ నీరు చేరుతుండటంతో నీరంతా కాలుష్యంగా మారుతుంది. మురుగునీరు చేరకుండా ఎస్టీపీ (సీవరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్)లు ఏర్పాటు చేయాలి. చెరువుల సుందరీకరణ చేపట్టి ఆహ్లాదం అందించే విధంగా తీర్చిదిద్దాలి. డ్రైనేజీలను సైతం మెరుగుపర్చాలి. రామసముద్రం చెరువులోకి మురుగునీరు రాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు కట్టపై జిమ్‌ను పునరుద్ధరించాలి. –కృష్ణ
డిపో పునరుద్ధరణ


