విధులపై అవగాహన కలిగి ఉండాలి
అదనపు కలెక్టర్ పాండు
సంగారెడ్డి జోన్: మున్సిపల్ ఎన్నికల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ పాండు స్పష్టం చేశారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు పోలింగ్ నిర్వహణ విధులపై మాస్టర్ ట్రైనర్‌తో శనివారం రెండవ విడత శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ..అంశాలను క్షుణ్ణంగా చదివి పోలింగ్ విధులపై స్పష్టమైన అవగాహన ఏర్పరుచుకోవాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సజావుగా పోలింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. శిక్షణ తరగతులకు 1,298 మంది పీఓలు, ఏపీఓలు హాజరైనట్లు ఎన్నికల శిక్షణ తరగతుల నోడల్ అధికారి రామాచారి తెలిపారు.


