కరెంట్‌ కోతలు ఎక్కడా లేవు | - | Sakshi
Sakshi News home page

కరెంట్‌ కోతలు ఎక్కడా లేవు

Feb 8 2026 7:54 AM | Updated on Feb 8 2026 7:54 AM

కరెంట్‌ కోతలు ఎక్కడా లేవు

కరెంట్‌ కోతలు ఎక్కడా లేవు

● జిల్లాలో నిరంతరం విద్యుత్‌ సరఫరా ● విద్యుత్‌శాఖ పర్యవేక్షక ఇంజనీర్‌ సుధీర్‌కుమార్‌

● జిల్లాలో నిరంతరం విద్యుత్‌ సరఫరా ● విద్యుత్‌శాఖ పర్యవేక్షక ఇంజనీర్‌ సుధీర్‌కుమార్‌

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లాలో కరెంట్‌ కోతలు లేవని విద్యుత్‌శాఖ ఎస్పీడీసీఎల్‌ పర్యవేక్షక ఇంజనీర్‌ సుధీర్‌కుమార్‌, డివిజనల్‌ ఇంజనీర్‌ నెహ్రునాయక్‌ స్పష్టం చేశారు. పరిశ్రమలకే కాదు, గృహ, ఇతర అన్ని రకాల కనెక్షన్లకు అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామన్నారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. హెచ్‌.టి కేటగిరీ కింద వచ్చే పరిశ్రమలకు, గృహ విద్యుత్‌ కనెక్షన్లకు నిరంతరం విద్యుత్‌ సరఫరా చేయడంపై ప్రత్యేక దృష్టిసారించామన్నారు. లోడ్‌ రిలీఫ్‌లు ఎక్కడా అమలు కావడం లేదని చెప్పారు. కొన్నేళ్లుగా జిల్లాలో లోడ్‌ రిలీఫ్‌ అనే ప్రసక్తే రాలేదని తెలిపారు. ఈ వేసవిలో విద్యుత్‌ డిమాండ్‌ భారీగా పెరుగనుందని, ఈ డిమాండ్‌కు అనుగుణంగా నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ముందస్తు ప్రణాళికను అమలు చేస్తున్నట్లు వివరించారు. రూ.157 కోట్లతో సమ్మర్‌యాక్షన్‌లో పలుచోట్ల 33/11కేవీ సబ్‌ స్టేషన్ల్లు ఏర్పాటు చేశామని, నాలుగు ప్రత్యామ్నాయ ఫీడర్లను సిద్ధం చేశామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement