ఓటమి నుంచి విజయం
నర్సాపూర్: ఎక్కడ కోల్పోయామో అక్కడే వెతుక్కోవాలనే సామెతను నిజం చేశారు మున్సిపాలిటీ పరిధిలోని ఆ రెండు కుటుంబాలు. గత ఎన్నికల్లో ఓటమి చెందగా, ఈసారి జరిగిన ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసి విజయఢంకా మోగించారు. పట్టణంలోని 12వ వార్డు నుంచి గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఎండీ. మహమూదాబేగం పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థి కుమ్మరి లక్ష్మి చేతిలో ఓటమి చెందారు. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో మహమూదాబేగం కోడలు సమీనా బేగం అదే వార్డు నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తాజా మాజీ కౌన్సిలర్ లక్ష్మిపై గెలుపొందారు. కాగా గత ఎన్నికల్లో అత్తపై లక్ష్మి గెలుపొందగా, ఆమెను ఈసారి కోడలు ఓడించింది.


