లేబర్‌ కోడ్స్‌ రద్దు చేయాలి | - | Sakshi
Sakshi News home page

లేబర్‌ కోడ్స్‌ రద్దు చేయాలి

Feb 6 2026 7:21 AM | Updated on Feb 6 2026 7:21 AM

లేబర్‌ కోడ్స్‌ రద్దు చేయాలి

లేబర్‌ కోడ్స్‌ రద్దు చేయాలి

రామచంద్రాపురం(పటాన్‌చెరు): కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్‌ కోడ్స్‌ను వెంటనే రద్దు చేసి, పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని సీఐటీయూ జిల్లా నాయకుడు నర్సింహారెడ్డి డిమాండ్‌ చేశారు. రామచంద్రాపురం పట్టణంలోని ఈఎస్‌ఐ ఆస్పత్రి వద్ద బుధవారం సీఐటీయూ సమ్మె నోటీసు ఇచ్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మోదీ ప్రభుత్వం లేబర్‌ కోడ్‌లను తేవడం వలన కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. కాంట్రాక్ట్‌ వ్యవస్థను రద్దు చేసి పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేయాలని డిమాండ్‌ చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు కనీస వేతనాలు పెంచాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు సురేశ్‌, లోకనాథ్‌, సంతోష, లక్ష్మి, సోనీ తదితరులు పాల్గొన్నారు.

కరపత్రాల ఆవిష్కరణ

నారాయణఖేడ్‌: నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.సాయిలు పిలుపునిచ్చారు. ఖేడ్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...కేంద్రం తీసుకువచ్చిన కార్మిక వర్గాన్ని విచ్ఛిన్నం చేసే లేబర్‌కోడ్‌ను రద్దు చేయాలన్నారు. కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి ముక్త కంఠంతో వ్యతిరేకించాలని సూచించారు. డివిజన్‌ కార్యదర్శి రమేశ్‌, బా లప్ప, రాజన్న, శివరాజ్‌, మాణికయ్య, నర్సింహులు, సంజీవులు, ఎల్లయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement