వివాహిత ఆత్మహత్య
శివ్వంపేట(నర్సాపూర్): ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మండల పరిధిలోని చిన్నగొట్టిముక్ల పంచాయతీ సామ్య తండాలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్‌ఐ మధుకర్‌రెడ్డి కథనం ప్రకారం.. ఇదే మండలం బోజ్య పంచాయతీ హరిదాస్ తండాకు చెందిన బానోత్ దుర్గ్య పెద్ద కూతురు మౌనిక(19)ను ఏడాది క్రితం సామ్య తండాకు చెందిన పాత్‌లోత్ అజయ్‌తో వివాహం జరిగింది. గురువారం కుటుంబ సభ్యులు కూతురు దగ్గరికి వెళ్లగా.. ఇంట్లో ఒంటరిగా ఉన్న మౌనిక రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న మౌనిక కుటుంబ సభ్యులు, బంధువులు గురువారం అర్ధరాత్రి సామ్య తండాకు చేరుకున్నారు. మౌనిక మృతికి అత్తింటివారే కారణం అంటూ ఇంట్లోని సామగ్రి ధ్వంసం చేశారు. పోలీసులు భారీగా తండాకు చేరుకుని ఆందోళనకారులను అదుపుచేశారు. తన కూతురు కడుపునొప్పి బాధ భరించలేక ఆత్మహత్యకు పాల్పడిందని మృతిరాలు తండ్రి దుర్గ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు.
అత్తింటివారే కారణమంటూ
కుటుంబ సభ్యుల ఆగ్రహం
ఇంట్లోని సామగ్రి ధ్వంసం
వివాహిత ఆత్మహత్య


