తెల్లాపూర్‌లో ఉద్రిక్తత
రామచంద్రాపురం(పటాన్‌చెరు): తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని గద్దర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని కొందరు తొలగించేందకు ప్రయత్నించడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రితం తెల్లాపూర్ గ్రామస్తులు మహారాజ్ శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కాగా శుక్రవారం మధ్యాహ్నం ఆ విగ్రహం పక్కనే గ్రామస్తులు జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేసి పూలమాల వేసి నివాళులర్పించారు. దీంతో ఇరువర్గాల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. అదే సమయంలో కొందరు పూలే విగ్రహాన్ని నెట్టే ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారి తీసింది. సంఘటన స్థలానికి చేరుకున్న సైబరాబాద్ అదనపు డీసీపీ ఉదయ్ రెడ్డి ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించి, పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇరువర్గాలకు చెందిన పలువురిని కొల్లూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నర్సింగ్ ఏసీపీ రమణ గౌడ్ ఆధ్వర్యంలో గద్దర్ సర్కిల్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


